amp pages | Sakshi

హామిల్టన్‌ ‘పోల్‌’ రికార్డు

Published on Sun, 09/03/2017 - 01:47

ఎఫ్‌1 చరిత్రలో అత్యధికంగా 69 సార్లు పోల్‌ పొజిషన్‌ 
షుమాకర్‌ పేరిట ఉన్న రికార్డు బద్దలు


మోంజా (ఇటలీ): ఫార్ములావన్‌ క్రీడలో శనివారం కొత్త రికార్డు నమోదైంది. మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్, ప్రపంచ మాజీ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ ఈ క్రీడా చరిత్రలో అత్యధికసార్లు ‘పోల్‌ పొజిషన్‌’ సాధించిన డ్రైవర్‌గా రికార్డు నెలకొల్పాడు. శనివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌ సెషన్‌లో హామిల్టన్‌ అందరికంటే వేగంగా ఒక నిమిషం 35.554 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని పొందాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. తాజా ప్రదర్శనతో హామిల్టన్‌ జర్మనీ దిగ్గజం మైకేల్‌ షుమాకర్‌ (68 సార్లు) పేరిట ఐదేళ్లుగా ఉన్న ‘పోల్‌ పొజిషన్‌’ రికార్డును బద్దలు కొట్టాడు. తన కెరీర్‌లో హామిల్టన్‌ పోల్‌ పొజిషన్‌తో మొదలుపెట్టిన రేసుల్లో 37 సార్లు విజేతగా నిలిచాడు.  రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్లు వెర్‌స్టాపెన్, రికియార్డో వరుసగా రెండు, మూడు స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. భారత్‌కు చెందిన ఫోర్స్‌ ఇండియా జట్టు డ్రైవర్లు ఒకాన్‌ ఐదో స్థానం నుంచి, పెరెజ్‌ 11వ స్థానం నుంచి రేసును మొదలుపెడతారు.

గ్రిడ్‌ పొజిషన్స్‌: 1. హామిల్టన్‌ (మెర్సిడెస్‌), 2. వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌), 3. రికియార్డో (రెడ్‌బుల్‌), 4. లాన్స్‌ స్ట్రాల్‌ (విలియమ్స్‌), 5. ఒకాన్‌ (ఫోర్స్‌ ఇండియా), 6. బొటాస్‌ (మెర్సిడెస్‌), 7. రైకోనెన్‌ (ఫెరారీ), 8. వెటెల్‌ (ఫెరారీ), 9. మసా (విలియమ్స్‌), 10. వాన్‌డూర్నీ (మెక్‌లారెన్‌), 11. పెరెజ్‌ (ఫోర్స్‌ ఇండియా), 12. హుల్కెన్‌బర్గ్‌ (రెనౌ), 13. అలోన్సో (మెక్‌లారెన్‌), 14. క్వియాట్‌ (ఎస్టీఆర్‌), 15. సెయింజ్‌ (ఎస్టీఆర్‌), 16. మాగ్నుసెన్‌ (హాస్‌), 17. పాల్మెర్‌ (రెనౌ), 18. ఎరిక్సన్‌ (సాబెర్‌), 19. వెర్లీన్‌ (సాబెర్‌), 20. గ్రోస్యెన్‌ (హాస్‌).

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)