amp pages | Sakshi

హామిల్టన్‌... ఆగాగు!

Published on Tue, 10/23/2018 - 00:37

ఆస్టిన్‌ (అమెరికా): ఈ సీజన్‌లో ఎవరికీ అందనంత వేగంతో దూసుకెళ్తున్న లూయిస్‌ హామిల్టన్‌కు అమెరికాలో అనూహ్యంగా నిరాశ ఎదురైంది. ఇప్పటికే తొమ్మిది రేసుల్లో విజేతగా నిలిచిన ఈ మెర్సిడెస్‌ డ్రైవర్‌ ఇక్కడ మాత్రం మూడో స్థానంతో సరిపెట్టు కున్నాడు. దీంతో ఐదో ఫార్ములావన్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ కోసం అతనికి నిరీక్షణ తప్పడం లేదు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన యూఎస్‌ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ డ్రైవర్‌ కిమీ రైకోనెన్‌ విజేతగా నిలిచాడు. ఐదేళ్ల తర్వాత అతనికి ఈ టైటిల్‌ దక్కింది. చివరిసారిగా అతను 2013లో ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ప్రిలో గెలిచాడు. అమెరికన్‌ సర్క్యూట్‌లో 56 ల్యాప్‌ల రేసును అందరికంటే వేగంగా రైకోనెన్‌ 1 గంటా 34 నిమిషాల 18.643 సెకన్లలో పూర్తి చేశాడు.

2.342 సెకన్లు వెనుకబడిన హామిల్టన్‌ 1:34:16.301 సె. టైమింగ్‌తో మూడో స్థానంతో తృప్తిపడ్డాడు. రెడ్‌బుల్‌ డ్రైవర్‌ వెర్‌స్టాపెన్‌ (1:34:17.362 సె.) రెండో స్థానంలో నిలువగా, హామిల్టన్‌ ప్రత్యర్థి వెటెల్‌ (ఫెరారీ) నాలుగో స్థానం పొందాడు. ఫోర్స్‌ ఇండియా డ్రైవర్లలో ఈస్ట్‌బెన్‌ ఒకాన్‌ డిస్‌క్వాలిఫై కాగా, సెర్గియో పెరెజ్‌ ఎనిమిదో స్థానం పొందాడు.  తదుపరి రేసు మెక్సికన్‌ గ్రాండ్‌ప్రిలో ఒకవేళ వెటెల్‌ గెలిచినా కూడా... హామిల్టన్‌ టాప్‌–7లో నిలిస్తే చాలు ఇతనే ఐదోసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరిస్తాడు. వెటెల్‌ గెలవకపోతే హామిల్టన్‌ స్థానాలతో సంబంధం లేకుండా విజేతగా నిలుస్తాడు. ప్రస్తుతం హామిల్టన్‌ (346 పాయింట్లు), వెటెల్‌ (276 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌