amp pages | Sakshi

క్వార్టర్స్‌లో లోకేశ్‌ రెడ్డి

Published on Sat, 09/09/2017 - 10:44

రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌  


సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో కె. లోకేశ్‌ రెడ్డి ముందంజ వేశాడు. శేరిలింగంపల్లిలోని ఫిట్‌ ప్రొ బ్యాడ్మింటన్‌ హౌస్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన అండర్‌–15 బాలుర సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో లోకేశ్‌ రెడ్డి (హైదరాబాద్‌) 21–9, 14–21, 21–5తో టి. విఘ్నేశ్‌ (రంగారెడ్డి)పై గెలుపొందాడు. అంతకుముందు జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో లోకేశ్‌ 21–17, 21–15తో ధరణ్‌ కుమార్‌ (నిజామాబాద్‌)పై గెలుపొందాడు. బాలికల విభాగంలో హైదరాబాద్‌కు చెందిన మేఘనా రెడ్డి, పల్లవి జోషి ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు.

 

రెండోరౌండ్‌ మ్యాచ్‌ల్లో మేఘన 21–13, 21–8తో తేజస్విని (హైదరాబాద్‌)పై, పల్లవి 21–2, 21–3తో లలిత (మహబూబ్‌నగర్‌)పై గెలుపొందారు. అండర్‌–17 విభాగంలో నగరానికి చెందిన అనురాగ్, రోహిత్‌ రెండో రౌండ్‌కు చేరుకున్నారు. తొలిరౌండ్‌లో అనురాగ్‌ 21–10, 21–8తో క్షితిజ్‌ (నిజామాబాద్‌)పై, కె. రోహిత్‌ రెడ్డి 14–21, 21–16, 21–9తో శ్రీజిత్‌ (నిజామాబాద్‌)పై విజయం సాధించారు. బాలికల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ప్రణవి (హైదరాబాద్‌)– శ్రావ్య (వరంగల్‌) ద్వయం 21–12, 21–9తో కోమల్‌– శ్రీ అదితిపై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకుంది. పోటీలకు ముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ‘శాట్స్‌’ ఎండీ ఎ. దినకర్‌ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఇటీవల జాతీయ స్థాయిలో విజయాలు సాధించిన పి. లోకేశ్‌రెడ్డి, కె. సాత్విక్‌ రెడ్డిలకు రాష్ట్ర బ్యాడ్మింటన్‌ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్‌ చెరో 10వేల ప్రోత్సాహకాన్ని అందించారు.  
 
ఇతర మ్యాచ్‌ల ఫలితాలు

అండర్‌–15 బాలుర రెండోరౌండ్‌: నిఖిల్‌ రాజ్‌ (హైదరాబాద్‌) 21–3, 21–13తో పవన్‌ కుమార్‌ (నల్లగొండ)పై, జి. ప్రణవ్‌ రావు (రంగారెడ్డి) 21–11, 21–9తో టి. రుష్యేంద్ర (మెదక్‌)పై, వెంకట్‌ సుహాస్‌ (రంగారెడ్డి) 21–3, 21–6తో దినేశ్‌ (ఆదిలాబాద్‌)పై, శశాంక్‌ (హైదరాబాద్‌) 21–4, 21–6తో నిమిత్‌ కుమార్‌ (కరీంనగర్‌)పై, పి. సాయి విష్ణు (రంగారెడ్డి) 22–20, 21–13తో వై. వెంకట్‌ (రంగారెడ్డి)పై, ఉనీత్‌ కృష్ణ (హైదరాబాద్‌) 21–11, 21–18తో సాహస్‌ (మెదక్‌)పై గెలుపొందారు.  

బాలికలు: పూజిత (రంగారెడ్డి) 21–4, 21–1తో అలంకృత (ఆదిలాబాద్‌)పై, అనుసోఫియా (హైదరాబాద్‌) 21–1, 21–0తో మోనిక (మహబూబ్‌నగర్‌)పై, దేవిశ్రీ 17–21, 21–18, 21–19తో అదితిపై, కె. శ్రేష్టారెడ్డి (హైదరాబాద్‌) 21–7, 21–4తో ఎన్‌. అశ్విత (ఆదిలాబాద్‌)పై, సంజన (రంగారెడ్డి) 21–5, 9–21, 21–16తో ఆశ్రిత (ఖమ్మం)పై, ఎ. అభిలాష (హైదరాబాద్‌) 21–13, 21–4తో రెహానా జబీన్‌ (హైదరాబాద్‌)పై విజయం సాధించారు.  

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌