amp pages | Sakshi

మార్ష్‌ స్థానంలో మాక్స్‌వెల్‌..

Published on Mon, 03/13/2017 - 19:19

రాంచీ: ఆస్ట్రేలియా జట్టులో భుజం గాయం కారణంగా దూరమైన మిచెల్‌ మార్ష్‌ స్థానానికి ఇద్దరు ఆటగాళ్లు పోటిపడుతున్నారు. ఆసీస్‌ డొమెస్టిక్‌ క్రికెట్‌లో విక్టోరియా జట్టుకు చెందిన మార్కస్‌ స్టోయినిస్‌, గ్లేన్‌ మాక్స్‌వెల్‌ల్లో ఒకరు ఎంపిక అవనున్నారు. ఈ స్థానం కోసం ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య గట్టిపోటి నెలకొంది. వీరిద్దరిలో ఒకరు రాంచీలో గురువారం నుంచి జరిగే టెస్టులో పాల్గొనే అవకాశం ఉంది. నాలుగు మ్యాచ్‌ల బోర్డర్‌ గవాస్కర్‌ సిరీస్‌లో  ఇరుజట్ల మద్య పోటి రసవత్తరంగా మారడంతో ఈ ఎంపికకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే జట్టులో స్టార్‌ ఆటగాళ్లు స్టార్క్‌, మార్ష్‌ దూరమవడంతో జట్టు బలహీనమైంది.
 
పుణేలో ఓడిన భారత్‌, బెంగళూరులో ప్రతీకారం తీసుకోని దూకుడుగా ఉంది. సిరీస్‌లో ఇరుజట్లు 1-1 తో సమంగా ఉన్నాయి. అయితే మాక్స్‌వెల్‌ చేరికతో జట్టుకు లాభం చేకూరనుంది. మార్కస్‌ కూడా మార్ష్‌ లేని లోటు తీర్చుతూ బ్యాటింగ్‌, బౌలింగ్‌తో ఆల్‌రౌండర్‌ ప్రతిభ కనబర్చగలడు. అయితే కొద్ది రోజులుగా మాక్స్‌వెల్‌ ఫాంలో లేకపోవడం ఆసీస్‌ను కలవరపెడుతుంది. అయితే ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌కే పరిమితమైన మార్కస్‌ ఇప్పటి వరకు టెస్టులు ఆడలేదు. 3 వన్డేలు, ఒక టీ20 మినహా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన అనుభవం లేదు. దీంతో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో ఆసీస్‌ బోర్డు తర్జన భర్జన పడుతుంది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌