amp pages | Sakshi

‘ఐపీఎల్‌లోనూ ఆ ఘనత సాధిస్తా’

Published on Wed, 04/11/2018 - 20:28

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో తనకు అవకాశం ఇస్తే బ్యాట్‌తో కూడా రాణించాలని ఉందని అంటున్నాడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీ. టీ 20ల్లో అఫ్గానిస్తాన్‌ తరపున ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ రికార్డు కల్గిన నబీ తన బ్యాటింగ్‌ పవర్‌ను ఐపీఎల్‌లో కూడా చూపించాలని ఉందన్నాడు.  హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున‍్నందుకు ఆనందంగా ఉందన్న నబీ.. తాజా సీజన్‌లో బ్యాటింగ్‌లో ఆకట్టుకోవడమే తన లక్ష్యంగా పేర్కొన్నాడు.

‘ఈ లీగ్‌లో హైదరాబాద్‌పై అంచనాలు బాగానే ఉన్నాయి. కేన్‌ విలియమ్సన్‌ సారథ్యంలోని మా జట్టు అభిమానుల్ని అలరించడం ఖాయం. నాకు ఆడే అవకాశం లభిస్తే బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లో కూడా రాణిస్తా. ఐపీఎల్‌లో కూడా ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డు సాధించాలని ఉంది’ అని నబీ తెలిపాడు. తొలుత తన బౌలింగ్‌కు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్న ఈ అఫ్గాన్‌ ఆల్‌రౌండర్‌.. బ్యాటింగ్‌లో కూడా సత్తా చూపడతానని ధీమా వ్యక్తం చేశాడు. గతేడాది ఐర్లాండ్‌తో జరిగిన టీ 20లో నబీ 20 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. తద్వారా అఫ్గాన్‌ తరపున ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ  రికార్డును తన ఖాతాలో లిఖించుకున్నాడు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)