amp pages | Sakshi

జకోవిచ్‌ అలవోకగా..

Published on Mon, 06/03/2019 - 21:25

పారిస్‌: ప్రపంచ నెం.1, సెర్బియా స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అలవోకగా క్వార్టర్‌ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. సోమవారం పురుషుల సింగిల్స్‌లో జరిగిన ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో జకోవిచ్‌ 6–3, 6–2, 6–2తో జాన్‌ లెనార్డ్‌ స్ట్రఫ్‌(జర్మనీ)ని చిత్తు చేశాడు. గంటా 36 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో జకోవిచ్‌ 6 ఏస్‌లు సంధించి, 3 డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. 31 విన్నర్లు కొట్టి, 12 అనవసర తప్పిదాలు చేశాడు. సుదీర్ఘంగా జరిగిన మరో మ్యాచ్‌లో నిషికొరి(జపాన్‌) 6–2, 6–7(8/10), 6–2, 6–7(8/10), 7–5తో బెనాయిట్‌ పైర్‌(ఫ్రాన్స్‌)పై చెమటోడ్చి నెగ్గాడు.

దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ మారథాన్‌ పోరులో ఏడో సీడ్‌ నిషికోరికి 38వ ర్యాంకర్‌ అయిన ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తొలి, మూడవ సెట్లను నిషికోరి దక్కించుకోగా, టైబ్రేక్‌కు దారితీసిన రెండు, నాలుగు సెట్‌లు పైర్‌ వశమయ్యాయి. నిర్ణయాత్మక ఐదో సెట్‌లోనూ పోరు హోరాహోరీ సాగింది. పాయింట్‌ పాయింట్‌కూ ఇద్దరూ చెమటోడ్చారు.

చివరి ఈ సెట్‌తోపాటు మ్యాచ్‌ను దక్కించుకున్న నిషికోరి తదుపరి రౌండ్‌లో రెండో సీడ్‌ నాదల్‌తో తలపడతాడు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 14వ ర్యాంకర్‌ మాడిసన్‌ కీస్‌(అమెరికా) 6–2, 6–4తో సినియకోవా(చెక్‌రిపబ్లిక్‌)ను వరుస సెట్లలో చిత్తు చేసి క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకుంది. మరో మ్యాచ్‌లో సోఫియా కెనిన్‌(అమెరికా)ను 3–6, 6–3, 0–6తో ఇంటిబాట పట్టించిన ఎనిమిదో సీడ్‌ ఆష్లే బార్టీ(ఆస్ట్రేలియా)తో తదుపరి రౌండ్‌లో మాడిసన్‌ కీస్‌తో తలపడనుంది.

Videos

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)