amp pages | Sakshi

నంబర్‌వన్ స్థానంలో ఉన్న శ్రీలంక

Published on Wed, 08/07/2013 - 02:24

 హంబన్‌టోట: టి20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో ఉన్న శ్రీలంక ఎట్టకేలకు తమ స్థాయికి తగ్గ ఆటతీరును కనబరిచింది. దక్షిణాఫ్రికాతో మంగళవారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. డుప్లెసిస్ (65 బంతుల్లో 85; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), డుమిని (34 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం శ్రీలంక 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 164 పరుగులు చేసింది. దిల్షాన్ (51 బంతుల్లో 74 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా, జయవర్ధనే (16 బంతుల్లో 33; 7 ఫోర్లు) అతనికి సహకరించాడు. చివర్లో తిసార పెరీరా (11 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) భారీ షాట్లతో విరుచుకు పడ్డాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-1తో కైవసం చేసుకుంది. దిల్షాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, డుమినికి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి.  
 
 భారీ భాగస్వామ్యం...
 మ్యాచ్ తొలి బంతికే ఓపెనర్ డేవిడ్స్ (0) అవుట్ చేసిన కులశేఖర దక్షిణాఫ్రికాను దెబ్బ తీశాడు. ఆ తర్వాత మెండిస్ బౌలింగ్‌లో డి కాక్ (19 బంతుల్లో 16; 3 ఫోర్లు) వెనుదిరిగాడు. ఈ దశలో జత కలిసిన డుప్లెసిస్, డుమిని భారీ షాట్లతో స్కోరును నడిపించారు. మాథ్యూస్ వేసిన ఒకే ఓవర్లో రెండు సిక్సర్లు బాదడంతో అత్యధికంగా 15 పరుగులు వచ్చాయి. వీరిద్దరు మూడో వికెట్‌కు 73 బంతుల్లోనే 112 పరుగులు జోడించడం విశేషం.
 
 తొలి ఓవర్‌నుంచే...
 లక్ష్య ఛేదనలో శ్రీలంక దూకుడు ప్రదర్శించింది. దిల్షాన్, జయవర్ధనే చెలరేగడంతో తొలి ఓవర్లో 14, రెండో ఓవర్లో 14 పరుగులు చేసిన జట్టు పవర్ ప్లే ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయి 67 పరుగులు సాధించింది. జయవర్ధనేను పార్నెల్ అవుట్ చేయగా, ఆ వెంటనే కుషాల్ పెరీరా (1) వెనుదిరిగాడు. చండీమల్ (14), మాథ్యూస్ (14) కూడా ప్రభావం చూపలేకపోయారు. అయితే మరో వైపు నిలబడిన దిల్షాన్ కంగారు పడకుండా మెరుపు బ్యాటింగ్‌తో లంకను గెలిపించాడు.
 

Videos

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?