amp pages | Sakshi

ఢిల్లీ క్యాపిటల్స్‌ లక్ష్యం 116

Published on Sat, 05/04/2019 - 17:52

ఢిల్లీ:  ఐపీఎల్‌లో భాగంగా ఇక్కడ ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 116 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.  రాజస్తాన్‌ బ్యాట్స్‌మెన్‌ ఘోరంగా విఫలం కావడంతో​ ఆ జట్టు స్పల్స స్కోరుకే పరిమితమైంది.  రాజస్తాన్‌ ఆటగాళ్లలో రియాన్‌ పరాగ్‌(50; 49 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా ఎవరూ రాణించలేదు. రహానే(2), లివింగ్‌ స్టోన్‌(14), సంజూ శాంసన్‌(5), లామ్రోర్‌(8), శ్రేయస్‌ గోపాల్‌(12), స్టువర్ట్‌ బిన్నీ(0), కృష్ణప్ప గౌతమ్‌(6), ఇష్‌ సోథీ(6)లు వరుసగా క్యూకట్టడంతో రాజస్తాన్‌ తేరుకోలేకపోయింది. ఢిల్లీ బౌలర్లు విజృంభించి బౌలింగ్‌ చేయడంతో రాజస్తాన్‌ మూడంకెల స్కోరును దాటడానికి ఆపసోపాలు పడింది. ఇషాంత​ శర్మ, అమిత్‌ మిశ్రాలు తలో మూడు వికెట్లు సాధించగా, ట్రెంట్‌ బౌల్ట్‌ రెండు వికెట్లు తీశాడు.

30 పరుగులకే నాలుగు వికెట్లు..

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్తాన్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు రహనే, లివింగ్‌ స్టోన్‌లు ఆదిలోనే పెవిలియన్‌ చేరారు. ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి రహానే ఔట్‌ కాగా, ఇషాంత్‌ శర్మ వేసిన మరుసటి ఓవర్‌లో లివింగ్‌ స్టోన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దాంతో 20 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది రాజస్తాన్‌. ఆపై వెంటనే సంజూ శాంసన్‌ రనౌట్‌ కావడంతో పాటు, లామ్రోర్‌ కూడా పెవిలియన్‌ బాటపట్టాడు. ఆ దశలో రియన్‌ పరాగ్‌ బాధ్యాయుతంగా ఆడాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా చివరి బంతి వరకూ క్రీజ్‌లో హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దాంతో రాజస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది.


 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌