amp pages | Sakshi

రసూల్ సెంచరీ

Published on Fri, 01/10/2014 - 00:51

వడోదర: జమ్మూ కాశ్మీర్ ఆల్‌రౌండర్, కెప్టెన్ పర్వేజ్ రసూల్ రంజీ ట్రోఫీలో తన బ్యాటింగ్ ఫామ్‌ను కొనసాగించాడు. ఈ సీజన్‌లో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన అతను క్వార్టర్ ఫైనల్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్‌తో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో రసూల్ (137 బంతుల్లో 103; 11 ఫోర్లు, 1 సిక్స్) శతకంతో రాణించి తన జట్టును మెరుగైన స్థితికి చేర్చాడు. రసూల్‌తో పాటు ఆదిల్ రిషి (108 బంతుల్లో 65; 9 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడటంతో మ్యాచ్ రెండో రోజు గురువారం జమ్మూ కాశ్మీర్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 277 పరుగులకు ఆలౌటైంది.
 
  ఫలితంగా ఆ జట్టు పంజాబ్‌కు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే కోల్పోయింది. రసూల్ నాలుగో వికెట్‌కు ఆదిల్‌తో 81 పరుగులు, సమీయుల్లా బేగ్ (37)తో ఏడో వికెట్‌కు 86 పరుగులు జోడించడం విశేషం. సందీప్ శర్మకు 4 వికెట్లు దక్కాయి. అనంతరం కాశ్మీర్ బౌలర్లు కట్టడి చేయడంతో పంజాబ్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. చేతిలో 8 వికెట్లు ఉన్న పంజాబ్ ప్రస్తుతం ఓవరాల్‌గా 42 పరుగుల ఆధిక్యంలో ఉంది.
 
 మహేశ్ రావత్ శతకం
 కోల్‌కతా: బెంగాల్‌తో జరుగుతున్న మరో క్వార్టర్స్‌లో రైల్వేస్ జట్టు ఆధిక్యం దిశగా వెళుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. మహేశ్ రావత్ (125 బంతుల్లో 105 బ్యాటింగ్; 18 ఫోర్లు, 1 సిక్స్), ఆరిందమ్ ఘోష్ (167 బంతుల్లో 78 బ్యాటింగ్; 11 ఫోర్లు) ఆరో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 191 పరుగులు జత చేయడం విశేషం.
 
 దిండా (3/83), శివ్ పాల్ (2/36) ధాటికి రైల్వేస్ ఒక దశలో 42 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే రావత్, ఘోష్ జోడి జట్టును ఆదుకుంది. ప్రస్తుతం మరో 84 పరుగులు వెనుకబడి ఉన్న రైల్వేస్ చేతిలో 5 వికెట్లు ఉండటంతో ఆధిక్యం సాధించే అవకాశం కనిపిస్తోంది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 274/8 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన బెంగాల్ మరో 43 పరుగులు జోడించి 317 పరుగులకు ఆలౌటైంది.
 ఉత్తరప్రదేశ్ వెనుకంజ
 బెంగళూరు: కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సరికి ఆ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.
 
  పర్వీందర్ సింగ్ (181 బంతుల్లో 92; 13 ఫోర్లు) సెంచరీ అవకాశం కోల్పోగా, పీయూష్ చావ్లా (99 బంతుల్లో 56; 5 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 110 పరుగులు జోడించడంతో యూపీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మరో వికెట్ మాత్రమే చేతిలో ఉన్న యూపీ ప్రస్తుతం 128 పరుగులు వెనుకబడి ఉంది. అంతకు ముందు ఓవర్ నైట్ స్కోరు 297/5తో రెండో రోజు ఆట ప్రారంభించిన కర్ణాటక తమ తొలి ఇన్నింగ్స్‌లో 349 పరుగులకు ఆలౌటైంది. సీఎం గౌతమ్ (100) సెంచరీ పూర్తి చేసుకోవడం గురువారం ఆటలో విశేషం.
 
 భారీ ఆధిక్యం దిశగా ముంబై
 ముంబై: మహారాష్ట్రతో వాంఖడే మైదానంలో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబైకి భారీ ఆధిక్యం దక్కే అవకాశం ఉంది. గురువారం ఆట ముగిసే సరికి మహారాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.
 
 అంకిత్ బానే (113 బంతుల్లో 84; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), కేదార్ జాదవ్ (66 బంతుల్లో 51; 9 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 115 పరుగులు జత చేసి జట్టును ఆదుకున్నారు. ముంబై బౌలర్ షార్దుల్ ఠాకూర్ (4/62) ఆకట్టుకున్నాడు. యువ ఆటగాడు విజయ్ జోల్ (15) వికెట్‌ను మాత్రం జహీర్ ఖాన్ పడగొట్టగలిగాడు. అంతకు ముందు ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌటైంది. చివర్లో ఇక్బాల్ అబ్దుల్లా (49 నాటౌట్), జహీర్ ఖాన్ (39) ఎనిమిదో వికెట్‌కు 62 పరుగులు జత చేయడం విశేషం. ప్రస్తుతం 3 వికెట్లు మాత్రమే చేతిలో ఉన్న మహారాష్ట్ర మరో 183 పరుగులు వెనుకబడి ఉండటంతో ముంబై భారీ ఆధిక్యం దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)