amp pages | Sakshi

చెలరేగిన రవితేజ, విహారి

Published on Tue, 12/24/2013 - 01:14

  హైదరాబాద్ 341/4
  జమ్మూకాశ్మీర్‌తో రంజీ మ్యాచ్
 జమ్మూ: హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ రవితేజ (217 బంతుల్లో 153 బ్యాటింగ్, 17 ఫోర్లు, 2 సిక్సర్లు), హనుమ విహారి (164 బంతుల్లో 109, 18 ఫోర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. జమ్మూకాశ్మీర్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’లో భాగంగా ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట పూర్తిగా రద్దు కావడంతో రెండో రోజు సోమవారం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసింది. ఒక్క రోజులోనే నిర్ణీత ఓవర్లు (90) కూడా పూర్తిగా ఆడకుండానే 300 పైచిలుకు పరుగులు చేయడం విశేషం. రవితేజ, విహారి వన్డేను తలపించేలా వీరవిహారం చేశారు.
 
  ఈ సీజన్‌లో చక్కని ఫామ్‌లో ఉన్న వీరిద్దరు ఈ మ్యాచ్‌లో సెంచరీలతో కదంతొక్కారు. మూడో వికెట్‌కు ఈ ఇద్దరు 203 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అంతకుముందు హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఓపెనర్ తిరుమలశెట్టి సుమన్ (9) విఫలమయ్యాడు. దీంతో జట్టు 22 పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది. మరో ఓపెనర్ అక్షత్ రెడ్డి (49) అర్ధసెంచరీ అవకాశాన్ని తృటిలో కోల్పోయినా... రవితేజతో కలిసి రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించాడు. జమ్మూకాశ్మీర్ కెప్టెన్ పర్వేజ్ రసూల్ ఏకంగా ఎనిమిది మంది బౌలర్లను ప్రయోగించినా హైదరాబాద్ దూకుడును అడ్డుకోలేకపోయాడు. సమీవుల్లా బేగ్, రామ్‌దయాళ్ పూనియా, బందీప్ సింగ్ తలా ఓ వికెట్ తీయగలిగారు.  ఆట ముగిసే సమయానికి రవితేజతో పాటు అమోల్ షిండే (4 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు.
 
 స్కోరు వివరాలు
 హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: సుమన్ (సి) ఒబేద్ హరూన్ (బి) సమీవుల్లా బేగ్ 9; అక్షత్ రెడ్డి రనౌట్ 49; రవితేజ బ్యాటింగ్ 153; విహారి (స్టంప్డ్) హరూన్ (బి) బందీప్ సింగ్ 109; ఖాద్రీ ఎల్బీడబ్ల్యూ (బి) రామ్‌దయాళ్ 8; షిండే బ్యాటింగ్ 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (84 ఓవర్లలో 4 వికెట్లకు) 341.
 వికెట్ల పతనం: 1-22, 2-109, 3-312, 4-337
 బౌలింగ్: సమీవుల్లా 16-0-97-1, మహ్మద్ గుజ్రీ 16-3-48-0, రామ్‌దయాళ్ 15-3-51-1, ఉమర్ నజీర్ 11-1-39-0, పర్వేజ్ రసూల్ 14-3-54-0, రిషీ 3-1-10-0, బందీప్ సింగ్ 8-2-24-1, మంజూర్‌దార్ 1-0-10-0.

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌