amp pages | Sakshi

వైరల్‌ : మైదానంలో పంత్‌ సర్కస్‌ ఫీట్‌ !

Published on Fri, 01/04/2019 - 16:20

సిడ్నీ : ఆస్ట్రేలియా పర్యటన టీమిండియా యువ వికెట్‌ కీపర్‌కు అచ్చొచ్చినట్లుంది‌. ఏం చేసినా అది అతనికి అనుకూలంగా బోలెడంత క్రేజ్‌ను తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఆసీస్ కెప్టెన్‌ టిమ్‌పైన్‌తో స్లెడ్జింగ్‌ అయితే ఏకంగా హీరోనే చేసింది. ఏ మాత్రం భయపడని ఈ యువ వికెట్‌ కీపర్‌ ఆతిథ్య ఆటగాళ్ల మాటకు మాటతోనే బదులివ్వడం.. సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయింది. మళ్లీ ఇదంతా ఆటలో భాగమేనని, మైదానం దాటితే తామంతా మంచి స్నేహితులమేనని క్రీడాస్పూర్తి చాటడం అభిమానుల విపరీతంగా ఆకట్టుకుంది.

మైదానంలో సరదాగా.. నా పిల్లలను ఆడిస్తావా? అన్న పైన్‌ మాటలను నిజం చేస్తూ.. పంత్‌ వారి పిల్లలను ఎత్తుకుని లాలించాడు. దీంతో టిమ్‌ పైన్‌ భార్య.. పంత్ మంచి బేబీ సిట్టర్‌ అని కూడా కితాబిచ్చింది. ఇక ఈ సిరీస్‌లో ఇదంతా ఒకవైపు అయితే..  తాజాగా జరుగుతున్న చివరి టెస్ట్‌లో అతని అద్భుత ప్రదర్శన మరోవైపు. ఇప్పటి వరకు అడపదడపా ఇన్నింగ్స్‌లతో నోటికే పని చెప్పిన ఈ యువ వికెట్‌ కీపర్‌.. చివరి టెస్ట్‌లో విశ్వం రూపం చూపించాడు. 189 బంతుల్లో 159 పరుగులు చేసి తన సత్తా చాటాడు. తద్వారా ఆసీస్‌ గడ్డపై శతకం బాధిన తొలి భారత వికెట్‌ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. 

షాన్‌ మైఖెల్సా? లేక పంత్‌?
చివరి టెస్ట్‌ రెండో రోజు ఆటలో భాగంగా డ్రింక్స్‌ బ్రేక్‌ సమయంలో పంత్‌ చేసిన ఓ సర్కస్‌ ఫీట్‌.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇది డబ్ల్యూడబ్ల్యూ స్టార్‌ షాన్‌ మైకెల్స్‌ రింగ్‌లో చేసిన ఫీట్‌లా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

Videos

చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు

చంద్రబాబుపై విద్యార్థుల కామెంట్స్

30 వేల కోట్ల ఆరోపణలపై పెద్దిరెడ్డి క్లారిటీ..!

జగన్ ప్రచార సభలో ఊహించని రెస్పాన్స్

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..!

పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుపుపై చిరంజీవి వీడియో..కొమ్మినేని స్ట్రాంగ్ రియాక్షన్

ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..

అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!

చంద్రబాబుపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..

రాక్షస పరివార్..

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?