amp pages | Sakshi

అయ్యో పంత్‌.. మళ్లీ అదే షాట్‌.. అదే ఔట్‌

Published on Sun, 12/15/2019 - 17:00

చెన్నై: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డే ద్వారా టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఫామ్‌లోకి వచ్చాడు.  69 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 71 పరుగులు చేసి ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. ఓ చక్కటి ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్న పంత్‌.. ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న సమయంలో తనకు అచ్చిరాని షాట్‌ను కొట్టి వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఎక్కువగా డీప్‌ బ్యాక్‌వర్డ్‌ స్వేర్‌ లెగ్‌, డీప్‌ పాయింట్‌ల్లో ఔటయ్యే పంత్‌ మళ్లీ అదే తప్పిదం  చేశాడు. బ్యాక్‌వర్డ్‌ స్వేర్‌ లెగ్‌లోకి భారీ షాట్‌ ఆడి వికెట్‌ కోల్పోయాడు. పొలార్డ్‌ వేసిన 40  ఓవర్‌ మూడో బంతిని కవర్స్‌ మీదుగా ఫోర్‌కు పంపిన పంత్‌.. ఆ ఓవర్‌ మరుసటి బంతిని స్వేర్‌ లెగ్‌ మీదుగా భారీ షాట్‌కు యత్నించాడు.(ఇక్కడ చదవండి: అయ్యర్‌ మళ్లీ కొట్టేస్తే.. పంత్‌ ఎన్నాళ్లకెన్నాళ్లకు)



అయితే ఆ బంతి పూర్తిగా మిడిల్‌ కాకపోవడంతో పైకి లేచింది. దాంతో అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న హెట్‌మెయిర్‌ క్యాచ్‌ పట్టుకోవడంతో పంత్‌ సెంచరీ చేసుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. పంత్‌ వన్డేల్లో ఎప్పుడో అరంగేట్రం చేసినా ఈ మ్యాచ్‌ ముందు వరకూ హాఫ్‌ సెంచరీ నమోదు చేయలేదు.  ఈ మ్యాచ్‌ ద్వారా హాఫ్‌ సెంచరీ లోటును పూడ్చుకున్న పంత్‌.. దాన్ని సెంచరీగా మలచుకోవడంలో విఫలమయ్యాడు.  భారత స్కోరు 210 పరుగుల వద్ద ఉండగా పంత్‌ ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. అంతకుముందు శ్రేయస్‌ అయ్యర్‌(70) సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అల్జారీ జోసెఫ్‌ బౌలింగ్‌లో మిడ్‌ వికెట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న పొలార్డ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ వర్మ(36) ఫర్వాలేదనిపించగా, కేఎల్‌ రాహుల్‌(6), విరాట్‌ కోహ్లి(4)లు విఫలమయ్యారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)