amp pages | Sakshi

పుణె సక్సెస్ కు కారణం ఇదే..

Published on Sun, 05/21/2017 - 17:15

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జట్టు రైజింగ్ పుణె సూపర్ జెయింట్. అయితే ఆ జట్టు తుది సమరానికి సిద్ధమై మేటి జట్లను సైతం ఔరా అనిపించింది. ఇదిలా ఉంచితే, ఐపీఎల్ ఆరంభానికి ముందు పుణె జట్టు సాహసోపేత నిర్ణయం తీసుకుంది.  ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనిని తప్పించి ఆ బాధ్యతల్ని స్టీవ్ స్మిత్ కు అప్పగించింది. దీనిపై అప్పట్లో దుమారం చెలరేగినప్పటికీ, ఆ తరువాత అంతా సర్దుకుంది.  ఇక్కడ ధోని కూడా తనను కెప్టెన్సీ నుంచి తప్పించారనే విషయాన్ని పట్టించుకోకుండా మిస్టర్ కూల్ తరహాలో అప్పచెప్పిన పనిని సమర్ధవంతంగా చేసుకుపోవడంతో జట్టులో ఎటువంటి విభేదాలు చోటు చేసుకోలేదు.

దీన్ని కాసేపు పక్కకు ఉంచితే, ఈ సీజన్ లో పుణె జట్టు స్వల్ప మార్పుతో బరిలోకి దిగింది. గత సీజన్ పుణె సూపర్ జెయింట్స్ గా వచ్చి నిరాశపరిచిన పుణె.. ఈసారి పుణె సూపర్ జెయింట్ గా పోరుకు సిద్ధమైంది. కేవలం జట్టు పేరులో  'ఎస్' అనే చివరి అక్షరాన్ని తొలగించి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. ఇలా పేరు మార్చడానికి న్యూమరాలజీ(సంఖ్యా శాస్త్రం)నే కారణమంటున్నాడు పుణె యజమాని సంజీవ్ గోయంకా.  తనకు సంఖ్యాశాస్త్రంపై పెద్దగా నమ్మకం లేకపోయినప్పటికీ, పేరు మార్చి చూస్తే ఏంపోతుంది అనే ఉద్దేశంతోనే అలా చేసినట్లు పేర్కొన్నాడు. ఇది పుణె జట్టును ఫైనల్ వరకూ చేర్చడంలో సహకరించిందంటూ తెగ ఆనందపడిపోతున్నాడు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌