amp pages | Sakshi

అక్తర్‌ వివాదం.. మాకు సంబంధం లేదు!

Published on Fri, 06/05/2020 - 12:03

కరాచీ: పాకిస్తాన్‌ క్రికెట్‌ మాజీ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌పై తఫాజ్జుల్‌ రిజ్వి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో తమకేటి సంబంధం అంటుంది పీసీబీ. పీసీబీ లీగల్‌ అడ్వైజర్‌గా పని చేస్తున్న  తఫాజ్జుల్‌ రిజ్వి పిటిషన్‌లో తమ పాత్ర ఏమీ లేదని డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతోంది. ఒక వివాదంలో అక్తర్‌పై పరువు నష్టం దావా కేసు వేయగా, దాన్ని ఫెడరల్‌ ఇన్విస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎఫ్‌ఐఏ) విచారించనుంది. ఈ క్రమంలోనే అక్తర్‌కు ఇప్పటికే సమన్లు పంపిన ఎఫ్‌ఐఏ.. ఈరోజు విచారణ చేపట్టనుంది. తొలుత అక్తర్‌ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి తర్వాత ఎఫ్ఐఆర్‌ నమోదు చేయాలా.. వద్దా అనే అంశాన్ని పరిశీలిస్తామని ఇ‍ప్పటికే ఒక ఎఫ్‌ఐఏ అధికారి చెప్పగా, ఇప్పుడు పీసీబీ మాత్రం ఆ అంశంలో తమకు సంబంధం లేదని అంటోంది. గత నెల్లో అక్తర్‌ వ్యాఖ్యలు చేసినప్పుడు సీరియస్‌గా స్పందించిన పీసీబీ.. ఇప్పుడు మాత్రం ఆ వివాదంలోకి తమను లాగొద్దని తెలిపింది.   పీసీబీ అధికారి ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ రిజ్వీ ఫిర్యాదుపైనే అక్తర్‌కు సమన్లు జారీ అయ్యాయి. ఈ విషయంలో బోర్డుకు సంబంధం లేదు. అక్తర్‌పై రిజ్వి వ్యక్తిగత ఫిర్యాదులో భాగంగానే పరువు నష్టం దావా వేశాడు. అంతే కానీ అక్తర్‌పై మేము ఎటువంటి కేసు వేయలేదు’ అని తెలిపారు. (‘అందులో ఐపీఎల్‌ కంటే పీఎస్‌ఎల్‌ భేష్‌’)

ఇక అక్తర్‌ మాట్లాడుతూ.. ‘నేను ఎఫ్‌ఐఏ నుంచి ఒక నోటీసును అందుకున్నా. అది చాలా అస్పష్టంగా ఉంది. వారు నాకు పంపిన నోటీసు గందరగోళానికి గురి చేసేలా అస్పష్టంగా ఉంది. నా లాయర్‌ సల్మాన్‌ నియాజీతో మాట్లాడిన తర్వాత తదుపరి కార్యాచరణ ఏమిటనేది చెబుతా’ అని అక్తర్‌ తెలిపాడు. కాగా, తనపై అసభ్య పదజాలం వాడటమే కాకుండా న్యాయపరమైన అంశాల్లో అక్తర్‌ తలదూర్చిందుకు గాను అతనిపై పరువు నష్టం దావా వేశాడు రిజ్వి. ఈ క్రమంలోనే 100 మిలియన్ల పాకిస్తాన్‌ కరెన్సీ చెల్లించాలంటూ అందులో పేర్కొన్నాడు. అవినీతి ఆరోపణల్లో భాగంగా పాకిస్తాన్‌ వెటరన్‌ క్రికెటర్‌ ఉమర్‌ అక్మల్‌పై మూడేళ్లు నిషేధం విధించిన సందర్భంలో పీసీబీ లీగల్‌ డిపార్ట్‌మెంట్‌పై అక్తర్‌ అసంబద్ధ వ్యాఖ్యలు చేశాడు.

తన యూట్యూబ్‌ చానల్‌లో అక్మల్‌పై మూడేళ్ల నిషేధాన్ని తప్పుబట్టాడు. ఇది పీసీబీ లీగల్‌ అడ్వైజరీ అసమర్థవత వల్లే ఉమర్‌కు మూడేళ్ల శిక్ష పడిందంటూ వ్యాఖ్యానించాడు. అదే సమయంలో రిజ్విపై ఆరోపణలు చేశాడు. చాలా సున్నితమైన అంశాల్లో రిజ్వికి అనుభవం లేదంటూ విమర్శించాడు. పీసీబీ లీగల్‌ డిపార్ట్‌మెంట్‌ అనేది కుళ్లిన టెంక అంటూ విమర్శలు చేశాడు. పీసీబీ అండదండలు ఉన్న కారణంగానే రిజ్వి సుదీర్ఘ కాలం లీగల్‌ అడ్వైజర్‌గా కొనసాగుతున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంలో పీసీబీ కూడా సీరియస్‌ అయ్యింది. న్యాయపరమైన అంశాల్లో అక్తర్‌ తలదూర్చడం మంచిది కాదంటూ హెచ్చరించింది. ఈ క్రమంలోనే అక్తర్‌పై రిజ్వి పరువు నష్టం కేసు వేశాడు.  బోర్డు సాయంతోనే కేసు వేసినట్లు అందరికీ తెలుస్తున్నా, తమకేమీ సంబంధం లేదంటూ తప్పించుకునే పనిలో పడింది పీసీబీ.(విదేశాల్లో ఐపీఎల్‌-2020? బీసీసీఐ సమాలోచన)

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)