మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ విజేత ఫెడరర్
Published on Sun, 01/28/2018 - 18:17
మెల్బోర్న్: స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్, డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెడరర్ ఆస్ర్టేలియన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో క్రొయేషియాకు చెందిన ఆరోసీడ్ మారిన్ సిలిచ్‌పై 6-2, 6-7(5/7), 6-3, 3-6, 6-1తో గెలిపొందాడు. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్‌లో ఫెడరరే పైచేయి సాధించాడు.
ఈ విజయంతో కెరీర్లో 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్నాడు. ఇక 30వ గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఆడిన ఫెడరర్ 6 ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లు గెలుచుకొని నోవాక్ జొకోవిక్, ఆస్ట్రేలియన్ గ్రేటర్ రాయ్ ఎమెర్సన్ల సరసన అగ్రస్థానంలో నిలిచాడు. సెమీఫైనల్లో ఫెడరర్ దక్షిణకొరియా ప్లేయర్ చుంగ్యాన్పై గెలిచి ఫైనల్‌కి చేరిన విషయం తెలిసిందే.
#
Tags