amp pages | Sakshi

సచిన్‌.. నీ అంకిత భావానికి సలామ్‌!

Published on Sat, 09/28/2019 - 10:35

న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసి క్రికెట్‌ దిగ్గజ క్రికెటర్‌గా మన్ననలు అందుకుంటున్న సచిన్‌ టెండూల్కర్‌ ఈస్థాయికి రావడానికి కఠోర సాధనే చేశాడు. సచిన్‌ క్రికెట్‌ ఆడే సమయంలో తాను ఎలా ప్రాక్టీస్‌ చేశాడో చెప్పే వీడియోను ఒకటి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. పూర్తిగా నీరు ఉంచిన పిచ్‌పై సచిన్‌ ప్రాక్టీస్‌ చేసిన వీడియో.. ఇలా కూడా సాధన చేస్తారా అనిపిస్తోంది. ఫాస్ట్‌ పిచ్‌లపై బౌలర్లను ఎదుర్కోవడానికి నీరు నింపిన పిచ్‌ను సిద్ధం చేసుకుని రబ్బరు బంతులతో సచిన్‌ ప్రాక్టీస్‌ చేసిన ఒకనాటి వీడియో అది. దాన్ని సచిన్‌ షేర్‌ చేశాడు. ప్రధానంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా వంటి ఫాస్ట్‌ పిచ్‌లపై ఆడటానికి ఇలా ప్రాక్టీస్‌ చేశాడట.  ప్రత్యేకంగా నీటితో తడిసిన పిచ్‌లపై రబ్బరు బంతి వేగంగా రావడమే సచిన్‌ ఇలా ప్రాక్టీస్‌ చేయడానికి ప్రధాన కారణం. ఈ వైరల్‌గా మారిన సచిన్‌ పోస్ట్‌ చేసిన వీడియోకు ఒక చక్కటి క్యాప్షన్‌ ఇచ్చాడు. ‘ ఆటపై అంకిత భావం, ప్రేమ ఉంటే మనకు అదే కొత్త మార్గాలను చూపిస్తుంది. దీన్ని మించి ఎంజాయ్‌ కూడా చేయవచ్చు’ అని సచిన్‌ ట్వీట్‌ చేశాడు.

దీనికి స్పందించిన భారత మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌.. సచిన్‌ ప్రాక్టీస్‌ అత్యంత స్ఫూర్తిదాయకమైనదిగా అభివర్ణించారు. ఇటీవల లింక్‌డిన్‌లో వీడియో పోస్ట్‌ చేసిన సచిన్‌.. ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చాడు. రిస్క్‌ లేని చోటు ఉండదని, మనం సక్సెస్‌ కావాలంటే రిస్క్‌ చేయకతప్పదన్నాడు. మనకు నచ్చిన ఫీల్డ్‌లో రిస్క్‌ చేస్తే ఫలితం త‍ప్పకుండా వస్తుందన్నాడు. తాను కూడా ఓపెనర్‌గా సక్సెస్‌ అవ్వడానికి రిస్క్‌ చేయడం ఒక ప్రధాన కారణమన్నాడు. ‘ఒకానొక సమయంలో ఓపెనర్‌గా వెళ్లడానికి టీమిండియా మేనేజ్‌మెంట్‌ను వేడుకున్నానని, చివరకు వారికి సవాల్‌ విసిరి మరీ ముందుకెళ్లానన్నాడు. ఒకవేళ తాను ఓపెనర్‌గా విజయవంతం కాలేకపోతే మళ్లీ దాని ప్రస్తావన తీసుకురానని చాలెంజ్‌ చేసి ఆ బాధ్యతలను తీసుకున్నానన్నాడు.

Videos

వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?