amp pages | Sakshi

సఫారీలు గెలిచారు

Published on Mon, 03/21/2016 - 00:52

అఫ్ఘానిస్తాన్‌పై దక్షిణాఫ్రికా విజయం 
రాణించిన డివిలియర్స్  టి20 ప్రపంచకప్

 
ముంబై: టి20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భారీ స్కోరు చేసినా ఓటమిపాలైన దక్షిణాఫ్రికా... రెండో మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్‌పై కూడా భారీ స్కోరు చేసి తడబడినా గెలిచింది. 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అఫ్ఘానిస్తాన్ ఓ దశలో చెలరేగినా సఫారీ బౌలర్లు చివర్లో కట్టడి చేయగలిగారు. ఆదివారం వాంఖడే స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 37 పరుగులతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేశారు. డివిలియర్స్ (29 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) తనదైన శైలిలో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 

ఓపెనర్ ఆమ్లా (5) విఫలమైనా... డికాక్ (31 బంతుల్లో 45; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డు ప్లెసిస్ (27 బంతుల్లో 41; 7 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 65 పరుగులు జోడించారు. తర్వాత డివిలియర్స్ సిక్సర్ల జోరు చూపెట్టాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా... రషీద్ వేసిన 17వ ఓవర్‌లో నాలుగు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో 29 పరుగులు రాబట్టాడు. తర్వాతి ఓవర్‌లో మరో సిక్సర్ బాది అవుట్‌కాగా... డుమిని (20 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి నాలుగో వికెట్‌కు 76 పరుగులు జత చేశాడు. చివర్లో మిల్లర్ (8 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడటంతో ప్రొటీస్ స్కోరు 200 దాటింది. అఫ్ఘానిస్తాన్ 20 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ మహ్మద్ షెహజాద్ (19 బంతుల్లో 44; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరవిహారం చేశాడు.

తొలి ఓవర్‌లో ఓ సిక్స్, ఫోర్‌తో పాటు, అబాట్ వేసిన రెండో ఓవర్‌లో మూడు సిక్స్‌లు, ఓ ఫోర్ బాదాడు. దీంతో రెండు ఓవర్లలో అఫ్ఘాన్ స్కోరు 33 పరుగులకు చేరింది. మూడో ఓవర్‌లో 14 పరుగులు రాబట్టిన షెహజాద్.. నాలుగో ఓవర్‌లో అనూహ్యంగా స్టంపౌటయ్యాడు. దీంతో నూర్ అలీ జద్రాన్ (24 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి తొలి వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అస్గర్ (7) విఫలమైనా... గుల్బాదిన్ (18 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా స్పందించడంతో అఫ్ఘానిస్తాన్ తొలి 10 ఓవర్లలో 2 వికెట్లకు 103 పరుగులు చేసింది. తర్వాత గుల్బాదిన్, నూర్ అలీలు వరుస ఓవర్లలో అవుట్‌కావడం ఇన్నింగ్స్‌పై ప్రభావం చూపింది. మిడిలార్డర్‌లో సైమూల్లా షెన్వారి (14 బంతుల్లో 25; 3 ఫోర్లు) మినహా  అంతా విఫలమవడంతో...  67 పరుగుల తేడాలో ఏడు వికెట్లు చేజార్చుకుంది. 4 వికెట్లు తీసిన మోరిస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

 స్కోరు వివరాలు
 దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) షెహజాద్ (బి) హమ్జా 45; ఆమ్లా (సి) అస్గర్ (బి) షాపూర్ 5; డు ప్లెసిస్ రనౌట్ 41; డివిలియర్స్ (సి) నూర్ అలీ (బి) నబీ 64; డుమిని నాటౌట్ 29; మిల్లర్ (సి) గుల్బాదిన్ (బి) దౌలత్ 19; వీస్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 209.

 వికెట్ల పతనం: 1-25; 2-90; 3-97; 4-173; 5-203.
బౌలింగ్: అమిర్ హమ్జా 3-0-25-1; దౌలత్  3-0-46-1; షాపూర్ 3-0-28-1;  నబీ 4-0-35-1; రషీద్ ఖాన్ 4-0-51-0; షైన్వారి 3-0-22-0.

 అఫ్ఘానిస్తాన్ ఇన్నింగ్స్: షెహజాద్ (బి) మోరిస్ 44; నూర్ అలీ (స్టంప్) డికాక్ (బి) తాహిర్ 25; అస్గర్ (సి) డికాక్ (బి) మోరిస్ 7; గుల్బాదిన్ నబీ (సి) డికాక్ (బి) అబాట్ 26; మహ్మద్ నబీ (సి) డివిలియర్స్ (బి) తాహిర్ 11; సైమూల్లా షెన్వారి (సి) వీస్ (బి) అబాట్ 25; నజీబుల్లా జద్రాన్ (సి) డికాక్ (బి) రబడ 12; రషీద్ ఖాన్ (బి) మోరిస్ 11; దౌలత్ జద్రాన్ (బి) మోరిస్ 0; అమిర్ హమ్జా నాటౌట్ 3; షాపూర్  (బి) రజడ 1; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (20 ఓవర్లలో ఆలౌట్) 172.

 వికెట్ల పతనం: 1-52; 2-60; 3-105; 4-109; 5-140; 6-156; 7-156; 8-167; 9-169; 10-172.
 బౌలింగ్: రబడ 4-0-37-2; అబాట్ 4-0-36-2; మోరిస్ 4-0-27-4; తాహిర్ 4-0-24-2; వీస్ 4-0-47-0.
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)