amp pages | Sakshi

లంకకూ స్పిన్‌ దెబ్బ

Published on Fri, 08/16/2019 - 05:48

గాలే: శ్రీలంక, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టును బౌలర్లు శాసిస్తున్నారు. తొలిరోజు కివీస్‌ మెడకు స్పిన్‌ ఉచ్చు బిగించిన శ్రీలంక రెండో రోజు అదే ఉచ్చులో చిక్కుకుంది. దీంతో గురువారం ఆటలో 12 వికెట్లు నేలకూలాయి. 203/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభమైన న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 83.2 ఓవర్లలో 249 పరుగుల వద్ద ముగిసింది. తొలి సెషన్‌లో లంక పేసర్‌ లక్మల్‌ (4/29) విజృంభించాడు. దీంతో కేవలం 46 పరుగులే జోడించి మిగతా సగం వికెట్లను కోల్పోయింది. రాస్‌ టేలర్‌ (86; 6 ఫోర్లు)  ఓవర్‌నైట్‌ స్కోర్‌ వద్దే నిష్క్రమించాడు. టెయిలెండర్లు సౌతీ 14, బౌల్ట్‌ 18 పరుగులు చేశారు.

తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన శ్రీలంక... ఎజాజ్‌ పటేల్‌ (5/76) దెబ్బకు  80 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఓపెనర్లు తిరిమన్నె (10), కరుణరత్నే (39; 4 ఫోర్లు) విఫలమవడంతో 66 పరుగులకే 2 వికెట్లను కోల్పోయింది. కుశాల్‌ మెండిస్‌ (53; 7 ఫోర్లు, 1 సిక్స్‌), మాథ్యూస్‌ (50; 7 ఫోర్లు, 1 సిక్స్‌) కుదురుగా ఆడటంతో జట్టు స్కోరు 2 వికెట్లకు 143 పరుగులకు చేరింది. ఎజాజ్‌ తిప్పేయడంతో 18 పరుగుల వ్యవధిలో 5 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. 161 పరుగులకే 7 వికెట్లను కోల్పోయిన లంకను  వికెట్‌ కీపర్‌ డిక్‌వెలా (39 బ్యాటింగ్‌; 1 ఫోర్‌), లక్మల్‌ (28 బ్యాటింగ్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఆదుకున్నారు. అబేధ్యమైన ఎనిమిదో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. ప్రస్తుతం లంక మరో 22 పరుగులు వెనుకబడి ఉంది.  

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)