amp pages | Sakshi

ఆసీస్‌కు భారీ టార్గెట్‌

Published on Fri, 01/17/2020 - 17:19

రాజ్‌కోట్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 341 పరుగుల భారీ టార్గెట్‌ను  నిర్దేశించింది. శిఖర్‌ ధావన్‌(96; 90  బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్‌ కోహ్లి(78;76 బంతుల్లో 6 ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌( 80; 52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్‌ శర్మ(42; 44 బంతుల్లో 6ఫోర్లు)లు రాణించడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. 

టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో టీమిండియా ఇన్నింగ్స్‌ను రోహిత్‌-శిఖర్‌ ధావన్‌లు ఆరంభించారు. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళుతున్న క్రమంలో రోహిత్‌ తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఈ జోడి మొదటి వికెట్‌కు 81 పరుగులు జోడించింది. ఆపై ధావన్‌కు కోహ్లి జతకలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలోనే ధావన్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు.  ఈ జోడి 103 పరుగులు జత చేసిన తర్వాత ధావన్‌ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. కాసేపటికి శ్రేయస్‌ అయ్యర్‌(7) పెవిలియన్‌ చేరాడు. జంపా బౌలింగ్‌లో షాట్‌ ఆడబోగా అది మిస్‌ కావడంతో బౌల్డ్‌ అయ్యాడు.(ఇక్కడ చదవండి: ధావన్‌-కోహ్లి ఎట్‌ 3 వేలు)

గత మ్యాచ్‌లో విఫలమైన కోహ్లి..ఈ మ్యాచ్‌లో మంచి జోష్‌ మీద ఉన్న సమయంలో పెవిలియన్‌ చేరాడు. ఆడమ్‌ జంపా వేసిన 44 ఓవర్‌ తొలి బంతిని భారీ షాట్‌ ఆడిన కోహ్లి పెవిలియన్‌ చేరాడు. కాగా, కోహ్లిని దురదృష్టం వెంటాడింది.  బౌలర్‌ ఎండ్‌ వైపు నేరుగా కోహ్లి భారీ షాట్‌  కొట్టగా, అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న ఆగర్‌ ఆ బంతిని బౌండరీ లైన్‌కు కాస్త వెలుపల పట్టుకుని దాన్ని మరో ఫీల్డర్‌ స్టార్క్‌కు విసిరేశాడు. ఇది ఆగర్‌ బౌండరీ లైన్‌ను దాటకముందే  స్టార్క్‌ కు అందివ్వడంతో కోహ్లి పెవిలియన్‌కు చేరాల్సి  వచ్చింది. (ఇక్కడ చదవండి: అయ్యో.. రోహిత్‌)

ఆపై వచ్చిన మనీష్‌ పాండే(2) స్వల్ప వ్యవధిలోనే ఔటయ్యాడు. ఆ తరుణంలో కేఎల్‌ రాహుల్‌కు జత కలిసిన రవీంద్ర జడేజా(20; 16 బంతుల్లో 1 ఫోర్‌) ఫర్వాలేదనిపించాడు. ఈ జోడి 58 పరుగులు జత చేసిన తర్వాత రాహుల్‌ రనౌట్‌ అయ్యాడు. అది చివరి ఓవర్‌ కావడంతో స్కోరును పెంచే క‍్రమంలో రాహుల్‌ రనౌట్‌గా నిష్క్రమించాడు. ఆసీస్‌ బౌలర్లలో ఆడమ్‌ జంపా మూడు వికెట్లు సాధించగా, కేన్‌ రిచర్డ్‌సన్‌ రెండు వికెట్లు తీశాడు. 


 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌