amp pages | Sakshi

నీకంత సీన్ లేదు..!

Published on Tue, 09/05/2017 - 15:44

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఆటగాడు షబ్బిర్ రెహ్మాన్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో భాగంగా బంగ్లాదేశ్ ఆదిలోనే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ తరుణంలో షబ్బిర్ అర్థ శతకంతో జట్టును ఆదుకున్నాడు. అయితే షబ్బిర్ బ్యాటింగ్ పై ఆసీస్ స్పిన్నర్ నాధన్ లయన్ ప్రశంసలు కురింపించాడు. షబ్బిర్ బ్యాటింగ్ ను చూస్తుంటే తనకు భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి బ్యాటింగ్ గుర్తుకొ్చ్చిందంటూ లయన్ కొనియాడాడు.

గతంలో భారత్ లో ఆసీస్ పర్యటన సందర్భంగా విరాట్ నుంచి ఎదురైన ప్రతిఘటన షబ్బిర్ లో కనబడిందన్నాడు.  ఇదిలా ఉంచితే, లయన్ కామెంట్ పై షబ్బిర్ తనదైన శైలిలో స్పందించాడు. 'నేను విరాట్ కోహ్లి స్థాయి ఆటగాడ్ని కాగలను. తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. కాకపోతే అతనితో నేను పోల్చుకోదలుచుకోలేదు. జట్టుకు అవసరమైన పరుగుల్ని సాధించడమే నాకు ముఖ్యం' అని షబ్బిర్ వ్యాఖ్యానించాడు.  దీనిపై విమర్శలు వర్షం కురుస్తోంది. షబ్బిర్.. నీ కంత సీన్ లేదంటూ ట్విట్టర్ లో నెటిజన్లు మండిపడుతున్నారు. నువ్వు విరాట్ కోహ్లి స్థాయి ఆటగాడివైతే ఇక మనం భూమిని విడిచే సమయం ఆసన్నమైనట్లే అంటూ ఛలోక్తులు విసురుకుంటున్నారు. ఇది చాలా మంచి జోక్ అంటూ ఒకరు వ్యాఖ్యానించగా, ఇక ఈ భూగ్రహం ఎంతమాత్రం మనం నివసించడానికి సేఫ్ గా లేనట్టేనని మరొకరు విమర్శించారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)