amp pages | Sakshi

పంజాబ్‌కు ‘ఆ ఇద్దరి’ బలం... 

Published on Tue, 03/19/2019 - 00:26

గత ఏడాది అశ్విన్‌ నాయకత్వంలో కొత్తగా కనిపించిన పంజాబ్‌ తొలి 9 మ్యాచ్‌లలో 6 గెలిచి దూసుకుపోయింది. కానీ తర్వాతి ఐదు మ్యాచ్‌లు కూడా ఓడి అనూహ్యంగా లీగ్‌ దశకే పరిమితమైంది. ఈ సారి మరింత నిలకడైన ప్రదర్శనను జట్టు ఆశిస్తోంది.  

బలాలు: ఓపెనర్లు క్రిస్‌ గేల్, లోకేశ్‌ రాహుల్‌ మెరుపు బ్యాటింగే జట్టును ముందుకు తీసుకెళ్లవచ్చు. ఐపీఎల్‌లో గేల్‌ ప్రదర్శన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంగ్లండ్‌తో ఇటీవలి వన్డే సిరీస్‌లో విధ్వంసకర ప్రదర్శనతో గేల్‌ తాను సిద్ధంగా ఉన్నానని చెప్పేశాడు. మరోవైపు టి20 ఫార్మాట్‌లో రాహుల్‌ రికార్డు ఘనం. గత ఏడాది అతను 158.41 స్ట్రయిక్‌ రేట్‌తో 659 పరుగులు చేశాడు. ఇప్పుడూ వీరిద్దరు అద్భుతమైన ఆరంభం ఇస్తే మిగిలిన ఆటగాళ్లు జోరు కొనసాగించడం కష్టం కాకపోవచ్చు. ఫామ్‌లో ఉన్న యువ ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌ జట్టు బ్యాటింగ్‌ బలం పెంచాడు. డేవిడ్‌ మిల్లర్‌ కూడా తుది జట్టులో ఉంటాడు. టీమిండియాకు దూరమైనా చేవ తగ్గలేదని నిరూపిస్తున్న అశ్విన్‌ తన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టి పడేయగలడు. అఫ్గానిస్తాన్‌ మిస్టరీ స్పిన్నర్‌ ముజీబుర్‌ రహమాన్‌ గత ఏడాది కూడా ఎంతో ప్రభావం చూపించాడు. కొత్తగా జట్టులోకి వస్తున్న వరుణ్‌ చక్రవర్తిపై కూడా ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. పేస్‌ బౌలింగ్‌లో ఆస్ట్రేలియన్‌ ఆండ్రూ టైదే ప్రధాన  బాధ్యత కాగా, భారత్‌ నుంచి అంకిత్‌ రాజ్‌పుత్‌ అన్ని మ్యాచ్‌లు ఆడవచ్చు.  

బలహీనతలు: టీమ్‌లో చెప్పుకోదగ్గ భారత ఆల్‌రౌండర్‌ ఎవరూ లేరు. ఇంగ్లండ్‌ సంచలనం స్యామ్‌ కరన్‌ ఉన్నా అతడికి తుది జట్టులో అన్ని మ్యాచ్‌లలో చోటు కష్టమే. మిడిలార్డర్‌లో కరుణ్‌ నాయర్, సర్ఫరాజ్‌ ఖాన్, మన్‌దీప్‌ సింగ్‌ ఏ మాత్రం రాణించగలరనేది సందేహమే. భారత పేసర్‌ మొహమ్మద్‌ 

షమీ ఉన్నా, గాయాల సమస్యతో పాటు ఐపీఎల్‌లో ఎప్పుడూ ప్రభావం చూపలేకపోయిన అతను ఈసారి ఎలాంటి ప్రభావం చూపిస్తాడనేది కీలకం. ఒంటి చేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగల గేల్‌ అండగా ప్లే ఆఫ్స్‌పై పంజాబ్‌ ఆశలు పెట్టుకోవచ్చు కానీ గత ఏడాదిలా కుప్పకూలిపోతే మాత్రం కష్టం  

జట్టు వివరాలు: అశ్విన్‌ (కెప్టెన్‌), రాహుల్, మన్‌దీప్, అంకిత్‌ రాజ్‌పుత్, కరుణ్‌ నాయర్, అశ్విన్‌ మురుగన్, సర్ఫరాజ్‌ ఖాన్, మయాంక్‌ అగర్వాల్, షమీ, అగ్నివేశ్, హర్‌ప్రీత్‌ బ్రార్, వరుణ్‌ చక్రవర్తి, అర్‌‡్షదీప్‌ సింగ్, సిమ్రన్‌ సింగ్, దర్శన్‌ (భారత ఆటగాళ్లు), హెన్రిక్స్, పూరన్, టై, గేల్, స్యామ్‌ కరన్, మిల్లర్, ముజీబ్, విలోన్‌ (విదేశీ ఆటగాళ్లు).    

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)