amp pages | Sakshi

యూఏఈ ‘జట్టు’లో మనోడు!

Published on Fri, 02/20/2015 - 15:05

ప్రస్తుతం ప్రపంచకప్‌లో ఆడుతున్న యూఏఈ జట్టులో ఖుర్రమ్‌ఖాన్ కీలక ఆటగాడు. అతని వయసు 43 ఏళ్లు. ఈ టోర్నీలో అందరికంటే పెద్దోడు అతనే. 43 ఏళ్ల వ్యక్తిని ఫిట్‌గా ఉంచాలంటే ఆటగాడితో పాటు ఫిజియో కూడా చాలా కష్టపడాలి. ఈ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తున్నాడు చిత్రాల సుధాకర్. హైదరాబాద్‌కు చెందిన సుధాకర్ యూఏఈ జట్టుకు ఫిజియోగా సేవలందిస్తున్నాడు.    
 - సాక్షి క్రీడావిభాగం
 
 ఈసారి ప్రపంచకప్‌లో ఏదో ఒక రూపంలో పాల్గొంటున్న హైదరాబాదీలు నలుగురు ఉన్నారు. రాయుడు భారత జట్టులో సభ్యుడు కాగా... ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్, జట్టు మేనేజర్ అర్షద్ అయూబ్ కూడా నగరానికి చెందిన వారే. అయితే భారత జట్టుతో కాకుండా యూఏఈ జట్టుతో కలిసి టోర్నీలో సభ్యుడిగా ఉన్న మరో హైదరాబాదీ చిత్రాల సుధాకర్. ఈయన యునెటైడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ) జట్టుకు ఫిజియోగా సేవలందిస్తున్నాడు.
 
 అండర్-17 జట్టుతో మొదలు
 యూఏఈ సీనియర్ జట్టుతో సుధాకర్ సుమారు తొమ్మిదేళ్ల నుంచి పని చేస్తున్నాడు. ఐసీసీ ఆరు దేశాల టోర్నీ కోసం 2006లో ఆ జట్టు సుధాకర్‌ను ఫిజియోగా తీసుకుంది. ఆ సందర్భంగా జట్టుతో చేరిన అతను షాక్‌కు గురయ్యాడు. జట్టులో అందరూ 35 ఏళ్లు పైబడినవారే. వారిలో చాలామంది అప్పుడే తొలి మ్యాచ్ ఆడబోతున్నారు కూడా. భారత్‌లో అనేక మంది ఆటగాళ్లు రిటైరయ్యే వయసులో వాళ్లు అరంగేట్రం చేయబోతున్నారు. అప్పుడే అర్థమైంది సుధాకర్‌కు... తన మీద చాలా పెద్ద బాధ్యత ఉందని. పెద్ద వయసు వాళ్లను మ్యాచ్‌లకు ఫిట్‌గా ఉంచడం సామాన్యమైన విషయం కాదు.
 
 ‘నా ఫిట్‌నెస్ రిపోర్టును బట్టి అప్పుడే ఆరుగురు ఆటగాళ్లపై వేటు పడింది. అయితే వారిలో చాలా మంది ఇతర ఉద్యోగాలు చేస్తూ క్రికెట్ ఆడుతున్నారనే సంగతి తర్వాత తెలిసింది. దాంతో అప్పటి పరిస్థితిని బట్టి ఆటగాళ్ల ఫిట్‌నెస్ అంశాన్ని చాలెంజ్‌గా తీసుకొని పని చేశాను’ అని సుధాకర్ చెప్పాడు. ఫిజియోగా అతని పని తీరు చూసిన యూఈఏ బోర్డు ఆ తర్వాత పూర్తి స్థాయి బాధ్యతలు అప్పజెప్పింది.
 
 ఆబిద్ అలీ సహకారంతో...
 సుధాకర్ 1993లోనే ఆంధ్ర రంజీ జట్టుతో కలిసి పని చేశాడు. అప్పట్లో ఆంధ్ర జట్టుకు పూర్తి స్థాయి ఫిజియోథెరపిస్ట్ లేడు. జట్టు కోచ్, మాజీ క్రికెటర్ ఆబిద్ అలీ చొరవతో సుధాకర్‌కు ఆ అవకాశం వచ్చింది. ఆ తర్వాత చాన్నాళ్లకు అదే ఆబిద్ అలీ సహకారంతో యూఏఈ అండర్-17 టీమ్‌కు ఫిజియోగా పని చేసేందుకు సుధాకర్ ఎంపికయ్యాడు. ఆ తర్వాత 2006లో యూఈఏ బోర్డు అతడిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేసేందుకు తీసుకుని, సీనియర్ జట్టు బాధ్యతలు అప్పగించింది.
 
 స్వదేశంలో కనీసం రెండు రోజుల మ్యాచ్‌లు కూడా ఆడలేని ఫిట్‌నెస్ సమస్యలు ఉన్న యూఏఈ జట్టు గత ఐదేళ్లలో అంతర్జాతీయ స్థాయిలో నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడగలిగిందంటే... దానికి కారణం మనోడే. ‘మాలో దాదాపు అందరికీ చాలా ఏళ్లుగా సుధాకర్‌తో అనుబంధం ఉంది. గాయాల సమయంలో తర్వాతి మ్యాచ్‌లకు సిద్ధం చేయడంలో గానీ, మా ఫిట్‌నెస్ విషయంలో గానీ సుధాకర్ తీసుకున్న జాగ్రత్తలతో జట్టులో చురుకుదనం వచ్చింది’ అని యూఏఈ ఆటగాళ్లు అతడిపై ప్రశంసలు కురిపించారు.
 

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)