amp pages | Sakshi

టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే ఉమేశ్‌ ఫాస్టెస్ట్‌ రికార్డులు

Published on Sun, 10/20/2019 - 16:09

రాంచీ: బౌలర్‌గానే కాకుండా అవసరమైతే బ్యాట్‌తో కూడా రాణిస్తానని టీమిండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ మరోసారి చాటిచెప్పాడు. స్పెషలిస్టు బౌలరైన ఉమేశ్‌ యాదవ్‌.. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 10 బంతుల్లో 31 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సిక్సర్లు ఉండగా, ఇది ఉమేశ్‌కు టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు.ఉమేశ్‌ యాదవ్‌ వచ్చీ రావడంతోనే జార్జ్‌ లిండే వేసిన ఓవర్‌లో చివరి రెండు బంతుల్ని సిక్సర్లుగా కొట్టాడు. ఆపై మరొకసారి లిండే వేసిన ఓవర్‌లో మూడు సిక్సర్లు కొట్టాడు. దాంతో సిక్సర్ల రూపంలోనే 30 పరుగులు సాధించాడు.  కాగా,  ఈ క్రమంలోనే రెండు ఫాస్టెస్ట్‌ రికార్డుల్ని ఉమేశ్‌ యాదవ్‌ ఖాతాలో వేసుకున్నాడు.

30 పరుగుల్ని వేగవంతంగా సాధించిన జాబితాలో ఉమేశ్‌ టాప్‌లో నిలిచాడు. 9 బంతుల్లోనే ఉమేశ్‌ 30 పరుగులు చేశాడు. గతంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఆటగాడు స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ 30 పరుగుల్ని 10 బంతుల్లో సాధిస్తే దాన్ని ఉమేశ్‌ బ్రేక్‌ చేశాడు. వేగవంతంగా 30కి పైగా పరుగులు సాధించిన జాబితాలో ఉమేశ్‌, ఫ్లెమింగ్‌ల తర్వాత వెస్టిండీస్‌ ఆటగాడు నామ్‌ మెక్లీన్స్‌(1998లో దక్షిణాఫ్రిపై 12 బంతుల్లో), అబ్దుల్‌ రజాక్‌(2011లో జింబాబ్వేపై 17 బంతుల్లో)లు వరుస స్థానాల్లో ఉన్నారు. ఇక టెస్టు ఫార్మాట్‌ చరిత్రలో 10 బంతులు, ఆపై ఆడిన అత్యధిక స్ట్రైక్‌రేట్‌ కల్గిన ఆటగాళ్లలో ఉమేశ్‌ అగ్రస్థానంలో నిలిచాడు. ఇక్కడ ఉమేశ్‌ యాదవ్‌ 310 స్టైక్‌రేట్‌తో టాప్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత ఫ్లెమింగ్‌ 281.81 స్టైక్‌రేట్‌తో రెండో స్థానంలో నిలిచాడు.  ఈ మ్యాచ్‌లో భారత్‌ 497/9 పరుగుల వద్ద తన తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేయగా, ఆపై ఇన్నింగ్స్‌ మొదలు పెట్టిన సఫారీలు 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయారు.డీన్‌ ఎల్గర్‌ను షమీ ఔట్‌ చేస్తే, డీకాక్‌ను ఉమేశ్‌ యాదవ్‌ పెవిలియన్‌కు పంపించాడు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)