amp pages | Sakshi

వైష్ణవి శుభారంభం

Published on Wed, 10/08/2014 - 01:33

జాతీయ ఓపెన్ టెన్నిస్

 న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణి పెద్దిరెడ్డి వైష్ణవి శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో ఆరో సీడ్ వైష్ణవి 6-2, 6-0తో శ్వేతా శ్రీహరి (తమిళనాడు)పై గెలిచింది. ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు అమ్మాయి రిషిక సుంకర కూడా ముందంజ వేసింది. తొలి రౌండ్‌లో టాప్ సీడ్ రిషిక 6-3, 6-4తో చామర్తి సాయి సంహిత (తమిళనాడు)ను ఓడించింది.
 బాలికల అండర్-18 సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణులు చల్లా హర్షసాయి, మౌళిక రామ్ మూడో రౌండ్‌లోకి ప్రవేశించగా... అమినేని శివాని, ఇస్కా అక్షర ఓడిపోయారు. రెండో రౌండ్‌లో హర్షసాయి 6-1, 7-5తో ఆరుషి కక్కర్ (చండీగఢ్)పై, మౌళిక 7-5, 6-2తో ఇషా బుద్వాల్ (మధ్యప్రదేశ్)పై గెలిచారు. శివాని 1-6, 3-6తో వన్షిక సాహ్ని (ఢిల్లీ) చేతిలో; అక్షర 1-6, 0-6తో అభినిక (తమిళనాడు) చేతిలో ఓడిపోయారు.
 పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారులు విఘ్నేశ్, విష్ణువర్ధన్ ముందంజ వేశారు. తొలి రౌండ్‌లో విఘ్నేశ్ 6-3, 6-3తో అజయ్ యాదవ్‌పై, విష్ణువర్ధన్ 7-5, 6-4తో బెరైడ్డి సాయిశరణ్ రెడ్డిపై గెలిచారు. మరో మ్యాచ్‌లో స్కోరు 2-6, 3-0తో ఉన్నదశలో షేక్ అబ్దుల్లా ప్రత్యర్థి ప్రజ్వల్ దేవ్ (కర్ణాటక) గాయం కారణంగా వైదొలిగాడు. బాలుర అండర్-18 విభాగం రెండో రౌండ్‌లో నిఖిల్ సాయి మన్నెపల్లి 1-6, 3-6తో అమర్‌నాథ్ అరోరా (ఢిల్లీ) చేతిలో ఓడిపోయాడు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌