amp pages | Sakshi

కెప్టెన్‌గా కోహ్లి రికార్డ్‌!

Published on Mon, 12/10/2018 - 11:38

అడిలైడ్‌ :  టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో అడిలైడ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోహ్లిసేన 31 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ల్లో కనీసం ఒక టెస్ట్‌ విజయం సాధించిన తొలి ఆసియా సారథిగా కోహ్లి చరిత్రకెక్కాడు. అంతేకాకుండా ఆసీస్‌ గడ్డపై సిరీస్‌ ఆరంభ మ్యాచ్‌ గెలిచిన భారత కెప్టెన్‌గా.. జట్టుగా అద్భుత ఫీట్‌ను సాధించారు. గతంలో భారత్‌ ఆసీస్‌ గడ్డపై ఐదు మ్యాచ్‌లు నెగ్గినప్పటికి ఎప్పుడు తొలి మ్యాచ్‌ను గెలవలేదు. 2008 పెర్త్‌ టెస్ట్‌ విజయానంతరం భారత్‌ ఆసీస్‌ గడ్డపై గెలుపొందడం విశేషం.

ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత్‌ తొలి రెండు టెస్ట్‌లు ఓడి సిరీస్‌ చేజార్చుకున్నప్పటికి చివరి జోహన్నస్‌ బర్గ్‌ మ్యాచ్‌ గెలిచింది. ఈ సిరీస్‌లో కోహ్లి 6 ఇన్నింగ్స్‌ల్లో 47.67 సగటుతో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అలాగే ఇంగ్లండ్‌ సిరీస్‌లోను తొలి రెండు మ్యాచ్‌లు ఓడిన కోహ్లిసేన నాటింగ్‌హోమ్‌ టెస్ట్‌ను గెలిచింది. అనంతరం ఇంగ్లండ్‌ మరో రెండు మ్యాచ్‌లు గెలిచి 4-1 సిరీస్‌ను కైవసం చేసుకుంది. 2014లో ఇంగ్లండ్‌ గడ్డపై దారుణంగా విఫలమైన కోహ్లి.. ఈ సిరీస్‌ తన సత్తా చాటాడు. 10 ఇన్నింగ్స్‌లో 59.3 సగటుతో 593 పరుగలు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌ నుంచి సహకారం లభించకపోవడంతో భారత్‌ సిరీస్‌ను కోల్పోయింది. అయితే ఆసీస్‌తో తాజా సిరీస్‌లో కోహ్లి బ్యాట్‌ మెరవకపోయినప్పటికీ.. పుజారా అద్భుత బ్యాటింగ్‌కు బౌలర్లు రాణించడంతో భారత్‌ విజయాన్నందుకుంది.

టాస్‌ గెలిస్తే విజయం కోహ్లిదే..
విరాట్‌ కోహ్లి టాస్‌ గెలిస్తే.. మ్యాచ్‌ భారతే నెగ్గుతుంది. ఇప్పటి వరకు కోహ్లి సారథ్యం వహించిన టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 20 సార్లు టాస్‌ గెలవగా.. ఇందులో భారత్‌ను 17 విజయాలు వరించాయి. మరో మూడు మ్యాచ్‌లు డ్రా అవ్వగా.. ఒక్క ఓటమి లేకపోవడం గమనార్హం. చదవండి: తొలి టెస్టులో టీమిండియా విజయం

Videos

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)