అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పిల్లలకు సర్ప్రైజ్ ఇచ్చిన విరాట్
Published on Fri, 12/20/2019 - 15:20
క్రిస్మస్ పండగంటే చాలా మంది పిల్లలు... సాంటా తాత వచ్చి బహుమతులెన్నో పంచి పెడతాడని ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. తల్లిదండ్రులు లేని చిన్నారుల సంగతైతే చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి వారి కోసం సాంటా తాతలా మారిపోయాడు లెజెండరీ క్రికెటర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. ఆటతో ఎప్పుడూ పుల్ బిజీగా ఉండే విరాట్ క్రిస్మస్ పండుగను ముందుగానే కొంతమంది పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్నాడు. సాంటా తాతలా వేషం వేసుకుని పిల్లలకు సర్ఫ్రైజ్ ఇచ్చాడు. క్రిస్మస్ సందర్భంగా వారికి బహుమతులు పంచిపెట్టాడు. వారితో కాసేపు సరదాగా గడిపిన విరాట్.. పిల్లలతో ముచ్చటించి సంతోషాన్ని పంచుకున్నాడు. సాంటా తాతల వేషం వేసుకున్న కోహ్లి వీడియో సోషల్ మీడియాలో వైర్ల్గా మారింది. ఈ సందర్భంగా అతన్ని పలువురు అభినందిస్తున్నారు.
#
Tags