amp pages | Sakshi

దేశం విడిచి వెళ్లిపో : విరాట్‌ కోహ్లి

Published on Wed, 11/07/2018 - 20:40

ఓ అభిమానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విరాట్‌ కోహ్లి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. నవంబర్‌ 5న పుట్టిన రోజు సందర్భంగా కోహ్లి తన పేరుతో ఉన్న యాప్‌ను ప్రారంభించాడు. ఈ యాప్‌లో ఓ క్రికెట్‌ ప్రేమికుడు భారత క్రికెటర్లపై కామెంట్లు చేశాడు. కాగా, అభిమాని వ్యాఖ్యలపై కోహ్లి ఇచ్చిన సమాధానం తీవ్ర దుమారం రేపింది. ‘కోహ్లి ఆటలో ప్రత్యేకత ఏం లేదు. ఇలాంటి ఇండియన్‌ క్రికెటర్ల కన్నా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా క్రీడాకారుల ఆటతీరే నాకు ఎంతో ఇష్టం’ అని ‘కోహ్లి యాప్‌’లో సదరు అభిమాని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై చిర్రెత్తుకొచ్చిన విరాట్‌ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. (హ్యాపీ బర్త్‌డే రన్‌మెషీన్‌)
 

‘నువ్వు భారత్‌లో ఉండాల్సిన వాడివి కాదు. ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియాలు మాత్రమే నీకు సరైనవి. దేశం విడిచి వెళ్లిపో. ఈ దేశంలో ఉంటూ పరదేశాలపై ప్రేమ చాలానే ఉంది. నీవు నన్ను అభిమానించ మాత్రాన నాకేం కాదు.కానీ, నీకు ఈ దేశం సరైంది కాదు’ అని బదులిచ్చాడు. కాగా, కోహ్లి వ్యాఖ్యలపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. విదేశాల్లో పెళ్లి చేసుకుని, విదేశీ వస్తువులను కొనుగోలు చేయండనే ప్రకటనల్లో పాల్గొంటూ.. దేశం గురించి మాట్లాడటం ఏంటని కోహ్లిపై విరుచుకుపడుతున్నారు.

Videos

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)