amp pages | Sakshi

అందుకే ధోనికి ఏ+ గ్రేడ్‌ దక్కలేదు!

Published on Thu, 03/08/2018 - 16:00

సాక్షి, స్పోర్ట్స్‌ : భారత క్రికెటర్లకు వార్షిక వేతనాలు భారీగా పెంచుతూ బీసీసీఐ కొత్త కాంట్రాక్టులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ కాంట్రాక్టుల్లో సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనిని డిమోట్‌ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే యువ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా, ధోని కన్నా ఎక్కువ వార్షిక వేతనం అందుకోనుండటం అభిమానులకు మింగుడుపడటం లేదు.

బీసీసీఐ ఈ సారి  ఏ+, ఏ, బీ, సీలుగా ఆటగాళ్ల కాంట్రాక్టులను విభజించింది. దీంతో గతేడాది టాప్‌లో ఉన్న ధోని ఏ+ గ్రేడ్‌ కొత్తగా రావడంతో ఏ గ్రేడ్‌లోనే కొనసాగుతున్నాడు. దీంతో ఏ+ గ్రేడ్‌ ఆటగాళ్లకు రూ.7 కోట్ల వార్షిక వేతనం అందనుండగా.. బీ గ్రేడ్‌లో ఉన్న ధోని రూ.5 కోట్లే అందుకోనున్నాడు. ఏ గ్రేడ్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, శిఖర్‌ ధావన్‌, జస్ప్రిత్‌ బూమ్రాలున్నారు. రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన బుమ్రాకు ధోని కంటే ఎక్కువ జీతం ఇవ్వడం అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. 

అయితే దీనికి వెనుక రెండు కారణాలున్నాయి. అన్ని ఫార్మట్లలో ఆడటం ఒకటైతే.. ఐసీసీ టాప్‌-10 ర్యాంకుల్లో ఉన్న ఆటగాళ్లకు ఏ+ గ్రేడ్‌ ఇవ్వడం రెండోది. ఈ అర్హతలు ధోనికి లేకపోవడంతో బీసీసీఐ ఏ గ్రేడ్‌కు డిమోట్‌ చేసింది. ఇక ధోని 2014లోనే టెస్టులకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అన్నీ ఐసీసీ టైటిళ్లు అందించిన ధోనికి బీసీసీఐ ఇచ్చే గౌరవం ఇదేనా అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనలు ధోని విషయంలో పక్కన పెట్టాల్సిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఇక భారత్‌ ధోని సారథ్యంలో టీ20, వన్డే వరల్డ్‌కప్‌, చాంపియన్స్‌ ట్రోఫీలు గెలవడమే కాకుండా టెస్టుల్లో నెం1 ర్యాంకు అందుకున్న విషయం తెలిసిందే. ఏ+ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లలో రోహిత్‌ మినహా మిగతా ఆటగాళ్లంతా ధోని సారథ్యంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయడం విశేషం.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)