నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
షమీ దుబాయి ఎందుకు వెళ్లాడు?
Published on Mon, 03/12/2018 - 18:54
కోల్‌కతా : భారత క్రికెటర్ మహ్మద్ షమీ కేసు మరో మలుపు తిరిగింది. భార్య హాసిన్ జహాన్ సంచలన ఆరోపణల నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. షమీ దుబాయ్ ఎందుకు వెళ్లాడని ఆరా తీయడంతో పాటు మ్యాచ్ ఫిక్సింగ్‌కు ఏమైనా సహకరించాడా అనే కోణంలో విచారణ చేపట్టినట్లు సమాచారం. దీనిలోభాగంగా షమీ దుబాయ్‌కు వెళ్లిన సమాచారం మీ దగ్గర ఏమైనా ఉందా అని పోలీసులు బీసీసీఐ అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
తన భర్త మోసగాడని, పలువురి మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని, తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని షమీ భార్య హసీన్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంతో ఇప్పటికే బీసీసీఐ ఇచ్చే వార్షిక వేతనాల కాంట్రాక్ట్ కోల్పోయిన షమీ, ఐపీఎల్‌లోనూ ఆడటం అనుమానంగా మారింది.
#
Tags