amp pages | Sakshi

సూపర్‌ సోనియా

Published on Sat, 11/24/2018 - 00:59

న్యూఢిల్లీ: బరిలో దిగిన తొలి ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లోనే యువ బాక్సర్‌ సోనియా చహల్‌ అదర గొట్టింది. శుక్రవారం జరిగిన 57 కేజీల సెమీఫైనల్లో సోనియా 5–0తో జో సన్‌ హవా (ఉత్తర కొరియా)పై నెగ్గి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో భారత స్టార్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ (48 కేజీలు) ఇప్పటికే ఫైనల్‌ చేరగా... తాజాగా సోనియా ఆమె సరసన చేరింది. 64 కేజీల విభాగంలో జరిగిన మరో సెమీఫైనల్లో సిమ్రన్‌జిత్‌ 1–4తో డాన్‌ డూ (చైనా) చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో భారత్‌ ఖాతాలో రెండు కాంస్యాలు చేరగా... ఇద్దరు బాక్సర్లు  స్వర్ణ పోరుకు సిద్ధమయ్యారు. శనివారం జరుగనున్న ఫైనల్లో హనా (ఉక్రెయిన్‌)తో మేరీకోమ్, ఆర్నెల్లా గాబ్రియల్‌ (జర్మనీ)తో సోనియా తలపడనున్నారు. 2006లో సొంత గడ్డపై జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో అత్యధికంగా భారత్‌ 4 స్వర్ణాలు సహా 8 పతకాలు సాధించింది. అనంతరం 2008లో 4 పతకాలు (1 స్వర్ణం, 1 రజతం, 2 కాంస్యాలు) దక్కించుకుంది. ఇప్పుడు ఈ ప్రదర్శనను మెరుగుపరిచే అవకాశం భారత బాక్సర్ల ముందుంది.  

హరియాణాకు చెందిన 21 ఏళ్ల సోనియా సెమీఫైనల్లో జకార్తా ఆసియా క్రీడల రజత పతక విజేతపై సునాయాసంగా గెలుపొందింది. మొదటి రెండు రౌండ్‌లు మామూలుగానే ఆడిన సోనియా... మూడో రౌండ్‌లో రెచ్చిపోయింది. ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. ప్రత్యర్థి ఎవరైనా తన సహజసిద్ధ ఆట మారదని చెప్పే సోనియా ఈ బౌట్‌లో అదే చేసి చూపించింది. ‘ఫైనల్‌కు చేరతానని ఊహించలేదు. సొంతగడ్డపై అభిమానుల మధ్య ప్రపంచ చాంపియన్‌షిప్‌లో దూసుకెళ్లడం సంతోషాన్నిస్తోంది. తొలి రెండు రౌండ్‌లు ముగిసేసరికి ప్రత్యర్థే ముందంజలో ఉందని కోచ్‌ చెప్పారు. దీంతో మూడో రౌండ్‌ ప్రారంభం నుంచే దూకుడు కనబర్చాను. ఫైనల్లోనూ ఇదే ఆటతీరు కొనసాగిస్తూ... స్వర్ణం గెలవడమే నా లక్ష్యం’ అని సోనియా వెల్లడించింది. తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌ బరిలో దిగి కాంస్యం నెగ్గడంపై సిమ్రన్‌జిత్‌ సంతోషం వ్యక్తం చేసింది.    

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌