amp pages | Sakshi

ద్రవిడ్‌ శిక్షణలో రాటుదేలుతా: బిల్లింగ్స్‌

Published on Mon, 04/10/2017 - 19:56

పుణే: భారత మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ శిక్షణలో తన బ్యాటింగ్‌ మరింత మెరుగవుతుందని ఇంగ్లండ్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ సామ్‌ బిల్లింగ్స్‌ అభిప్రాయపడ్డాడు. గత సీజన్‌ నుంచి బిల్లింగ్స్‌ ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత ఐపీఎల్‌లో ఆడటం వల్ల క్లిష్ట పరిస్థితుల్లో ఎలా ఆడాలో నేర్చుకున్నానన్నాడు. ముఖ్యంగా స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం, ఒత్తిడిలో ఆడటం మెరుగైనట్లు బిల్లింగ్స్‌ పేర్కొన్నాడు. ఢిల్లీ మెంటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కోచ్‌ ప్యాడి ఆప్టన్‌ నేతృత్వంలో ఆడటం గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు బిల్లింగ్స్‌ తెలిపాడు. వారిచ్చే సూచనలు తన కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడ్తాయన్నాడు. వారి అనుభవాలు పంచుకోవడం, సలహాలు ఇవ్వడంతో బ్యాటింగ్‌లో రాటుదేలుతానని బిల్లింగ్స్‌ అభిప్రాయపడ్డాడు.

ఢిల్లీ మంచి నైపుణ్య ఆటగాళ్లు ఉన్న జట్టు అని , కానీ తొలి మ్యాచ్‌ బెంగళూరుపై ఓడిపోవడం నిరాశకు గురిచేసిందన్నాడు. ఇది మాకు నిజంగా ఊహించలేని ఫలితమని, జరగబోయే మ్యాచ్‌లపై దృష్టిసారించమని బిల్లింగ్స్‌ తెలిపాడు. ఐపీఎల్‌లో ప్రతి జట్టు బలమైనదే అని, ప్రతి జట్టులో హిట్టర్లు, స్పిన్నర్లున్నారని చెప్పాడు. కాకపోతే వారి బలాలను ప్రదర్శించినపుడే ఫలితం ఉంటందన్నాడు.  ఢిల్లీలో కేవలం పేస్‌ బౌలింగ్‌ కాకుండా మంచి స్పిన్నర్లు జయంత్‌ యాదవ్‌, నదీమ్‌లు ఉన్నారని బిల్లింగ్స్‌ వ్యాఖ్యానించాడు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)