amp pages | Sakshi

బంగ్లాపై పంజా విసిరిన ఇంగ్లండ్‌

Published on Sat, 06/08/2019 - 22:55

కార్డిఫ్ ‌: పాకిస్తాన్‌ చేతిలో అనూహ్యంగా ఓడిపోయిన ఇంగ్లండ్‌.. సంచలనాల బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెబ్బులిలా విరుచుకుపడింది. దీంతో బంగ్లా 106 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడింది. ప్రపంచకప్‌లో భాగంగా కార్డిఫ్‌ వేదికగా జరిగిన బంగ్లా-ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో పరుగుల సునామీ సృష్టించింది. తొలుత జేసన్‌ రాయ్‌ (153;121 బంతుల్లో 14ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకం సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 386 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

అనంతరం షకీబుల్‌ హసన్‌(121; 119 బంతుల్లో 12ఫోర్లు, 1 సిక్సర్‌)వీరోచితంగా పోరాడినప్పటికీ బంగ్లాకు విజయాన్ని అందించలేకపోయాడు. షకీబ్‌ మినహా ఏవరూ రాణించకపోవడంతో బంగ్లా 48.5 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటై ఓటమి చవిచూసింది. భారీ శతకంతో ఇంగ్లండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన జేసన్‌ రాయ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.
ఇంగ్లండ్‌ నిర్దేశించిన 387 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాకు ఓపెనర్లు శుభారంభం అందించడంలో మరోసారి విఫలమయ్యారు. ఆర్చర బౌలింగ్‌లో సౌమ్య సర్కార్‌(2) పూర్తిగా నిరాశపరిచాడు. అనంతరం తమీమ్‌(19) తన చెత్త ఫామ్‌ను కొనసాగించాడు. ఈ తరుణంలో సీనియర్‌ ఆటగాళ్లు షకీబ్‌, రహీమ్‌లు మరోసారి బంగ్లాను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆది నుంచి షకీబ్‌ ధాటిగా ఆడే ప్రయత్నం చేయగా.. రహీమ్‌ ఆచితూచి ఆడాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 103 పరుగులు జోడించిన అనంతరం ప్లంకెట్‌ బౌలింగ్‌లో రహీమ్‌(44) వెనుదిరుగుతాడు. 

అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా షకీబ్‌ తన ఒంటరి పోరాటం కొనసాగించాడు. టెయిలెండర్లతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే కెరీర్‌లో ఎనిమిదో శతకం సాధించాడు. అనంతరం స్కోర్‌ పెంచే క్రమంలో షకీబ్‌ కూడా వెనుదిరగడంతో బంగ్లా ఓటమి లాంఛనమైంది. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆర్చర్, స్టోక్స్‌ తలో మూడు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించారు.

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ ఆటగాళ్లలో జేసన్‌ రాయ్‌(153; 121 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకానికి తోడు బెయిర్‌ స్టో(51; 50 బంతుల్లో 6 ఫోర్లు), జోస్‌ బట్లర్‌(64; 44 బంతుల్లో  2 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీలతో రాణించడంతో భారీ స్కోర్‌ సాధించింది. తాజా మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లలో సైఫుద్దీన్‌, మెహిదీ హసన్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, మోర్తజా, ముస్తాఫిజుర్‌లకు చెరో వికెట్‌ లభించింది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)