amp pages | Sakshi

వరల్డ్‌ కప్‌కు వెళ్లేదెవరు?

Published on Mon, 04/15/2019 - 04:23

ముంబై: అంబటి రాయుడు, కేఎల్‌ రాహుల్, దినేశ్‌ కార్తీక్, రిషభ్‌ పంత్, విజయ్‌ శంకర్, రవీంద్ర జడేజా... ఈ ఆరుగురిలో నలుగురికి అవకాశం, మరో ఇద్దరు ఔట్‌! వన్డే ప్రపంచ కప్‌లో పాల్గొనే భారత జట్టును నేడు ఎంపిక చేయనున్న నేపథ్యంలో చర్చ జరగనున్న అంశం ఇదొక్కటే. మే 30 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్‌కప్‌ కోసం 15 మంది సభ్యుల టీమ్‌ను ఎంపిక చేసేందుకు ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ సోమవారం సమావేశమవుతోంది. గత రెండేళ్లుగా వన్డేల్లో భారత జట్టు ప్రదర్శన చూస్తే 11 మంది సభ్యుల విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. మిగిలిన అదనపు నాలుగు స్థానాల కోసం మాత్రం చాలా మంది తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇంగ్లండ్‌ విమానమెక్కేదెవరో నేడు తేలనుంది. ముఖ్యంగా జట్టులో నాలుగో స్థానంలో ఆడే బ్యాట్స్‌మన్‌ విషయంలో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో సెలక్టర్ల ఆలోచనలేమిటో తెలిసే సమయం ఆసన్నమైంది.  

వీరు ఖాయం... 
ఫామ్, ఇంగ్లండ్‌ పరిస్థితులు, జట్టు వ్యూహాలు, కెప్టెన్‌ కోహ్లి ఆలోచనలను బట్టి చూస్తే తొలి 11 మంది ఆటగాళ్లు మరో మాటకు తావు లేకుండా ఎంపికవుతారు. వీరిలో కెప్టెన్‌ కోహ్లితోపాటు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్, ధోని, కేదార్‌ జాదవ్, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్, చహల్, బుమ్రా, భువనేశ్వర్, మొహమ్మద్‌ షమీ ఖాయం. వీరిలో ఆరుగురు 2015 ప్రపంచకప్‌లో పాల్గొన్నారు.  

రాయుడుకు అవకాశం ఉందా!  
గత ఆరు నెలలుగా నాలుగో నంబర్‌ ఆటగాడిపైనే చాలా చర్చ జరిగింది. నిజానికి గత ఏడాది అక్టోబరులో ఆసియా కప్‌ తర్వాత కోహ్లి బహిరంగంగానే రాయుడు సరైనవాడంటూ మద్దతు పలికాడు. గతేడాది ఐపీఎల్‌లో చక్కటి ప్రదర్శన తర్వాత రాయుడు టీమిండియాలోకి పునరాగమనం చేశాక భారత్‌ 24 వన్డేలు ఆడితే రాయుడు 21 ఆడాడు. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో వన్డే సిరీస్‌ సమయంలో ఇంకా అనిశ్చితి ఉందంటూ కోహ్లి, రోహిత్‌ చేసిన వ్యాఖ్యలు మళ్లీ సందేహాలు రేకెత్తించాయి. కివీస్‌తో చివరి వన్డేలో చక్కటి బ్యాటింగ్‌తో 90 పరుగులు చేసిన రాయుడు ఆసీస్‌తో సొంతగడ్డపై మూడు వన్డేల్లోనూ విఫలమయ్యాడు. ఆసియా కప్‌ నుంచి చూస్తే 42.18 సగటుతో రాయుడు చేసిన పరుగులు అద్భుతం కాకపోగా... అతడిని కొందరు మంచి బౌలర్లు ఇబ్బంది పెట్టిన తీరుతో కోహ్లి, రవిశాస్త్రి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని అనిపించింది.  

ఎవరి ఆట ఏమిటి? 
రేసులో ఉన్న కేఎల్‌ రాహుల్‌ ప్రస్తుతం ఐపీఎల్‌లో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్‌ ఆటను పట్టించుకోమని సెలక్టర్లు చెబుతున్నా... పూర్తిగా విస్మరించలేరు కూడా. రాహుల్‌ మిడిలార్డర్‌లో ఆడటంతో పాటు పైగా మూడో ఓపెనర్‌గా పని కొస్తాడు. మరోవైపు దినేశ్‌ కార్తీక్‌ తనకు లభించిన పరిమిత అవకాశాల్లోనూ అద్భుతం అనిపించేలా, తనపై నమ్మకం పెంచేలా ఒక్కసారి కూడా ఆడలేదు. ఇక రిషభ్‌ పంత్‌ కాస్త ముందంజలో ఉన్నాడు. ఏ క్షణానైనా ఆటను మార్చేయగల దూకుడుకు తోడు ఎడంచేతి వాటం కావడం అతని అదనపు బలం. ధోని ఉండటంతో కీపర్‌ స్థానంలో పరిగణించకుండా బ్యాట్స్‌మన్‌గా సెలక్టర్లు అతడిని చూస్తున్నారు.  

జడేజాకు చాన్స్‌! 
ఆల్‌రౌండర్‌ స్థానానికి జడేజా, విజయ్‌ శంకర్‌ మధ్య పోటీ ఉంది. శంకర్‌ పట్ల కొంత సానుకూలతలు ఉన్నా 9 వన్డేలే ఆడిన అతనిపై నమ్మకం ఉంచడం కష్టం. పైగా అతని స్లో మీడియం పేస్‌ బౌలింగ్‌ మధ్య ఓవర్లలో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. మరోవైపు జడేజా మాత్రం కచ్చితత్వంతో కూడిన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను కట్టి పడేయగల సమర్థుడు. దాని వల్ల వారిపై ఒత్తిడి పెరిగి వికెట్లు దక్కడం చాలా సార్లు జరిగింది. పైగా జట్టులో అత్యుత్తమ ఫీల్డర్‌. ఇటీవల స్వదేశంలో ఆస్ట్రేలియాతో చక్కగా రాణించడం జడేజాకు కలిసొచ్చే అంశం. ఇక కోహ్లి ఆలోచనల ప్రకారం నాలుగో రెగ్యులర్‌ పేసర్‌ అవసరం పెద్దగా లేదు కాబట్టి దాని గురించి చర్చ జరగడం సందేహమే. దీనిపై సెలక్టర్లు ఆలోచిస్తే మంచి వేగం ఉన్న నవదీప్‌ సైనీ పేరు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రపంచకప్‌లో పాల్గొనే జట్ల ప్రకటనకు ఏప్రిల్‌ 23 ఆఖరి తేదీ కాగా...  అవసరమైతే మార్పులు చేసేందుకు మే 23 వరకు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) అనుమతినిచ్చింది. 

Videos

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)