amp pages | Sakshi

బౌట్‌లో విషాదం: మెడ విరిగి రెజ్లర్ మృతి

Published on Fri, 04/06/2018 - 19:16

ముంబై: రెజ్లింగ్‌ క్రీడలో విషాదం చోటుచేసుకుంది. బౌట్‌లో ప్రత్యర్థితో పోరాటంలో మెడ విరిగిన రెజ్లర్ నీలేశ్ కందుర్కర్ (20) చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని కోల్హాపూర్‌లో చోటుచేసుకుంది. జ్యోతిబా జాతర సందర్భంగా గత సోమవారం కోల్హాపూర్‌లోని బండివేడ్‌లో కుస్తీ పోటీలు నిర్వహించారు. పాల్గొన్న తొలి బౌట్‌లోనే నీలేశ్‌కు బలమైన ప్రత్యర్థి ఎదురుపడ్డాడు. ఎక్కువగా ఆత్మరక్షధోరణిలో ఆడుతున్న నీలేశ్‌ ప్రత్యర్థికి పాయింట్లకు అవకాశం ఇవ్వడం లేదు. దీంతో అసహనానికి లోనైన మరో రెజ్లర్ నీలేశ్‌ను గాల్లోకి అమాంతం ఎత్తగా.. పట్టు విడిపించుకునే యత్నంలో కిందపడ్డాడు. 

ప్రత్యర్థి రెజ్లర్ సంబరాలు చేసుకుంటుండగా.. మెడపైనే పూర్తి బరువు పడుతూ పడిపోవడంతో నిలేశ్ స్పృహ కోల్పోయినట్లు గుర్తించిన అధికారులు కోల్హాపూర్‌లోని మెట్రో హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషయంగా ఉందని కరాడ్‌లోని క్రిష్ణ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. గత నాలుగు రోజులుగా వైద్యులు చేసిన యత్నాలు విఫలం కావడంతో రెజ్లర్ నీలేశ్ మృతిచెందాడు. 

ఆటలో అనుకోకుండా జరిగిన ఘటన కనుక ప్రత్యర్థి రెజ్లర్ పేరు వెల్లడించకూడదని నిర్ణయించుకున్నట్లు అధికారులు చెప్పారు. నీలేశ్ మృతికి కారణమైన రెజ్లర్ ఇంకా షాక్‌లోనే ఉన్నాడని, ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయాలని సూచించారు. మరోవైపు రెజ్లర్ నీలేశ్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)