amp pages | Sakshi

యువరాజ్‌ రిటైర్డ్‌ హర్ట్‌

Published on Mon, 08/05/2019 - 12:34

ఒంటారియో: గ్లోబల్‌ టీ20 కెనడాలో టోరంటో నేషనల్స్‌ తరఫున ఆడుతున్న యువరాజ్‌ సింగ్‌..  ఆదివారం రాత్రి మోంట్రియల్‌ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిటైర్డ్‌ హర్ట్‌గా పెవిలియన్‌ చేరాడు. కేవలం రెండు బంతులు మాత్రమే ఆడిన యువరాజ్‌ తీవ్రమైన వెన్నునొప్పితో సతమతమయ్యాడు. దాంతో ఫిజియో వచ్చి ప్రాథమిక చికత్స చేసినా నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండటంతో అర్థాంతరంగా ఫీల్డ్‌ను వీడాడు.టోరంటో నేషనల్స్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా ఏడో ఓవర్‌ రెండో బంతికి హెన్రిచ్‌ క్లాసెన్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన యువరాజ్‌ సింగ్‌ తొలి బంతికి పరుగులేమీ చేయలేదు. ఇక రెండో బంతిని స్వీప్‌ షాట్‌కు యత్నించి విఫలమయ్యాడు యువీ. ఆ క్రమంలో బ్యాట్‌ కూడా చేతి నుంచి జారిపోగా, వెన్నునొప్పితో బాధ  పడ్డాడు. అది ఎంతకీ తగ్గక పోవడంతో యువీ పెవిలియన్‌కు చేరక తప్పలేదు.

ఈ లీగ్‌లో యువీ దూకుడుగా ఆడుతున్నాడు.  విన్నీపెగ్‌ హాక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45పరుగులు చేసిన యువీ.. ఎడ్మాంటన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు.  బ్రాంప్టాన్‌ వాల్వ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 22 బంతుల్లో 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 51 పరుగులతో మెరిశాడు.ఈ మ్యాచ్‌లో టోరంటో నేషనల్స్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మోంట్రియల్‌ టైగర్స్‌ నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌