రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రభుత్వ పాఠశాలని దత్తత తీసుకున్న ప్రణీత
Published on Wed, 10/17/2018 - 08:26
యశవంతపుర : సొంత గడ్డపై నటి ప్రణీత తన మమకారం చాటుకున్నారు. అక్కడ ఎలాంటి సదుపాయాలకు నోచుకొని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నారు. రూ.5 లక్షలతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వచ్చారు. ప్రణీత మాట్లాడుతూ తాను పుట్టి పెరిగింది బెంగళూరు అయినప్పటికీ తన తండ్రి పుట్టింది మాత్రం ఆలూరులోనని పేర్కొన్నారు. సొంతూరు ఆలూరులో ఏదో ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని భావించి పాఠశాలను దతత్త తీసుకున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలలో మరుగుదొడ్డి నిర్మించడంతోపాటు తరగతి గదుల రూపురేఖలను మార్చి విద్యార్థులకు సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇది పూర్తయ్యాక మరికొన్ని పాఠశాలలను దత్తత తీసుకొనే ఆలోచన ఉందన్నారు. అంతేగాకుండా విద్యార్థులకు నైపుణ్యాలను నేర్పించేందుకు కృషి చేస్తానన్నారు.
#
Tags