amp pages | Sakshi

24 గంటలు.. 1,200 గుంతలు

Published on Tue, 11/05/2019 - 11:12

సాక్షి, ముంబై: బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) పరిపాలన విభాగం ప్రవేశపెట్టిన ‘గుంతలు చూపండి–రూ.500 పొందండి’ అనే పథకానికి ముంబైకర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఒక్క రోజులోనే బీఎంసీ యాప్‌కు ఏకంగా 1,700 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 24 గంటల్లోనే 1,200 గుంతలను పూడ్చివేయడంలో బీఎంసీ సఫలీకృతమైంది. కానీ, మిగతా 500 గుంతలను అలాగే గాలికి వదిలేయడంతో ముందుగా ప్రకటించిన ప్రకారం ఒక్కో ఫిర్యాదుదారుడికి రూ.500 బహుమతి సంబంధిత బీఎంసీ అసిస్టెంట్‌ కమిషనర్‌ చెల్లించాల్సి ఉంటుంది.

ఫిర్యాదులు పట్టించుకోవట్లేదని..
బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) పరిపాలన విభాగం వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. నగర రహదారులపై ‘గుంతలు చూపండి–రూ.500 పొందండి’అనే పథకం ప్రారంభించింది. బీఎంసీ యాప్‌పై ఫిర్యాదు నమోదు చేసిన 24 గంటల్లో గుంతను పూడ్చివేయని పక్షంలో సంబంధిత ఫిర్యాదు దారుడుకి రూ.500 చెల్లించనున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరాన్ని గుంతల రహితంగా తీర్చి దిద్దాలనే ఉద్దేశంతో బీఎంసీ ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. నగరంలో ప్రధాన రహదారులు మొదలుకుని చిన్న, చితక గల్లీలో సైతం రోడ్లు పటిష్టంగా ఉండాలని బీఎంసీ కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మిస్తుంది. అయినప్పటికీ అక్కడక్కడ గుంతలు ఉన్నాయని ముంబైకర్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నారు. దీంతో ఒక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి అందులో ఫిర్యాదులు చేయాలని కోరింది.

ఈ క్రమంలో ఆ వెబ్‌సైట్‌లో నిత్యం వందలాది ఫిర్యాదులు నమోదవుతున్నాయి. ఫిర్యాదు అందుకున్న బీఎంసీ సిబ్బంది అక్కడి వెళ్లి గుంతలను పూడ్చివేస్తారు. అయినప్పటికీ అనేక చోట్ల గుంతలు అలాగే ఉన్నాయంటూ ముంబైకర్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో బీఎంసీ పరిపాలన విభాగం ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ముంబైకర్లు ఫిర్యాదు చేసిన గుంత కనీసం ఒక అడుగు వెడల్పు, మూడు అంగుళాల లోతు ఉండాలి. అంతేగాకుండా ఆ గుంత బీఎంసీ హద్దులోని రహదారిపై ఉండాలి. ఫిర్యా దు చేసిన 24 గంటల్లో ఆ గంతను పూడ్చని పక్షంలో రూ.500 ఫిర్యాదుదారుడికి చెల్లించనుంది.

కల్తీ కోల్డ్‌ మిక్స్‌ రసాయనాల వాడకం
వర్షా కాలంలో నగర రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు బీఎంసీ రూ.80 కోట్లతో కాంట్రాక్టు ఇచ్చింది. పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించినప్పటికీ రోడ్లపై గుంతలు దర్శనమిస్తున్నాయి.గుంతలను పూడ్చేందుకు కోల్డ్‌ మిక్స్‌కు బదులుగా హాట్‌ మిక్స్‌ రసాయనాలను వాడాలని కార్పొరేటర్లు డిమాండ్‌ చేశారు. కాని బీఎంసీ పరిపాలన విభాగం కోల్డ్‌ మిక్స్‌ రసాయనాలను వినియోగించింది. కల్తీ కోల్డ్‌ మిక్స్‌ వల్ల గుంతల సంఖ్య తగ్గాల్సి ఉంది. కాని తాజా పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఫలితంగా వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాకుండా ఫుట్‌పాత్‌లపై ఫేవర్‌ బ్లాక్‌లు వాడొద్దని కార్పొరేటర్లు డిమాండ్‌ చేసినప్పటికీ వాటినే వినియోగిస్తున్నారు. దీంతో బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు బీఎంసీ స్పష్టం చేసింది.

#

Tags

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌