amp pages | Sakshi

వాగ్యుద్ధం

Published on Sat, 12/28/2013 - 03:28

 చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రజాసమస్యల పరిష్కారం కోసం శుక్రవారం నిర్వహించిన చెన్నై కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధంతో రసాభాసగా ముగిసింది. డీఎంకే సభ్యులు రెండుసార్లు వాకౌట్ చేసి అధికార పార్టీ వైఖరిపై అసంతృప్తిని వ్యక్తంచేశారు. మేయర్ సైదై దురైస్వామి అధ్యక్షతన కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ముందుగా దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది. అన్నాడీఎంకే సభ్యురాలు శాంతి మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలోని అన్యాక్రాంత భూములను ఏ మేరకు స్వాధీనం చేసుకున్నారని ప్రశ్నించారు. దీనిపై మేయ ర్ సమాధానమిస్తూ 2006 నుంచి 2011 వరకు 57 స్థలాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 
 
 అధికార పార్టీకి చెందిన మరో సభ్యుడు ఆర్ముగం లేచి డీఎంకే కేంద్ర కార్యాలయం నిర్మాణం అనంతరం స్థలాన్ని ఇంతవరకు కార్పొరేషన్‌కు అప్పగించలేదని పేర్కొన్నారు. 10 వేల చదరపు అడుగులకు మించి చేపట్టిన నిర్మాణం నుంచి కార్పొరేషన్‌కు కేటాయింపు జరగాల్సి ఉందని మేయర్ పేర్కొన్నారు. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థలం అప్పగింతకు నిరాకరించారని పేర్కొన్నారు. ఇందుకు డీఎంకే సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సమావేశంలో గందరగోళం సృష్టించారు. అధికార పార్టీ సభ్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాగ్వాదానికి దిగారు. అనంతరం సమావేశం నుంచి వాకౌట్ చేశారు. మరికొద్ది సేపటి తర్వాత మళ్లీ సమావేశం హాలులోకి వెళ్లారు.
 
 ఈ నేపథ్యంలో ఏర్కాడు ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘన విజయం సాధించడంపై అమ్మను అభినందిస్తూ తీర్మానం చేశారు. దీంతో మళ్లీ డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. చర్చలు, వాకౌట్‌లు, వాగ్యుద్ధాల నడుమ మొత్తం 75 తీర్మానాలు చేశారు. నగరంలోని మురికివాడలు, రోడ్లలో నివసించే ప్రజలకు 5 లక్షల దోమతెరలను ఉచితంగా పంచిపెట్టాలని తీర్మానించారు. మలేరియా, డెంగీ, చికున్‌గునియా, బోదకాలు వంటి వ్యాధులకు ప్రజలు గురికాకుండా ఇప్పటికే ఐదు లక్షల దోమ తెరలు పంపిణీ చేశామన్నారు. తాజాగా మరో ఐదు లక్షలను పంపిణీ చేయాలని నిర్ణయించామని తీర్మానంలో పేర్కొన్నారు. దోమతెరలతోపాటు 20 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నటు చెప్పారు. 
 
 ఇందుకుగాను కార్పొరేషన్‌కు రూ.8.45 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. సమావేశం నుంచి వాకౌట్ చేసిన డీఎంకే సభ్యుడు సుభాష్ చంద్రబోస్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చర్చించాల్సి ఉండగా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే తాము వాకౌట్ చేసినట్లు తెలిపారు. ప్రజా వినియోగానికి కేటాయించాల్సిన అన్నాఅరివాలయం స్థలంలో పార్కు, లైబ్రరీ నిర్మించామన్నారు. 
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)