amp pages | Sakshi

నేరాలకు అడ్డాగా 18 మెట్రోస్టేషన్లు

Published on Thu, 04/16/2015 - 22:37

గుర్తించిన ఢిల్లీ పోలీసులు
అసాంఘిక కార్యకలాపాలకు అనువుగా మారాయంటున్న పోలీసులు
స్టేషన్లు, ఆ పరిసర ప్రాంతాల్లో లైట్లు లేకపోవడమే కారణం

 
సాక్షి, న్యూఢిల్లీ : నేరాలకు నిలయాలుగా మారిన నగరంలోని 18 మెట్రో స్టేషన్లను ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఆ మెట్రో స్టేషన్ల పరిసరాల్లో వెలుతురు సరిగా లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అనువుగా మారాయని పోలీసులు తెలిపారు. చీకటిగా ఉన్న ఈ ప్రాంతాల్లో నేరాలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో మహిళల భద్రతకు ముప్పు అవకాశం ఉందని గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. కొన్ని పార్కింగ్ ఏరియాల్లో అయితే  లైట్లు కూడా లేవన్నారు.

కొన్ని మెట్రో స్టేషన్లకు వెళ్లే రహదారులపై అసలు వీధి దీపాలే లేవన్న సంగతి పోలీసుల విచారణలో తేలింది. నార్త్ ఢిల్లీలోని పుల్ బంగష్ మెట్రో స్టేషన్‌లో లైట్లు సరిగ్గా లేకపోవడంతో కొంత మంది దుండగులు తనను వెంబడించి వేధిస్తున్నట్లు ఓ మహిళ ఢిల్లీ పోలీసులకు మహిళా భద్రతా యాప్ హిమ్మత్ ద్వారా తెలపింది. దీంతో స్పందించిన పోలీసులు సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించారు. పోలీసు కంట్రోల్ రూమ్ విభాగం, స్థానిక పోలీసుల సహాయంతో ఈ సర్వే నిర్వహించారు.

 సర్వే వివరాలు..
ఢిల్లీ మెట్రోలో మొత్తం 138 స్టేషన్లు ఉన్నాయి. వీటిలో పటేల్ చౌక్, జహంగీర్‌పురి, నే తాజీ సుభాష్ ప్లేస్, అక్షర్‌ధామ్ మందిర్, మయూర్ విహార్-ఫేజ్ 1 ఎక్స్‌టెన్షన్, షాదీపుర్, పుల్ బంగష్, ఉత్తమ్‌నగర్ ఈస్ట్, ఉత్తమ్‌నగర్ వెస్ట్, పీరా ఘడీ, నాంగ్లోయ్, ద్వారకా మోడ్, ద్వారకా సెక్టర్-9, 10, 11, 12, 13, 14 స్టేషన్ల పరిసరాల్లో దీపాలు పనిచేయడం లేదని విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఉత్తం నగర్ ఈస్ట్, ఉత్తంనగర్, వెస్ట్, పీరా ఘడీ, నాంగ్లోయ్, ద్వారకా సెక్టర్-14, ద్వారకా సెక్టర్-13 స్టేషన్లలోని పార్కింగ్ ప్రదేశాల్లో అసలు దీపాలే లేవు. ద్వారకా మోడ్, ద్వారకా సెక్టర్-14, ద్వారకా సెక్టర్-13, అక్షర్‌ధామ్ మందిర్, మయూర్ విహార్-ఫేజ్ 1 ఎక్స్‌టెన్షన్, పుల్ బంగష్, షాదీపుర్ పరిసరాలు చీకటిమయంగా ఉన్నాయని తేలింది.

సర్వే నివేదిక పరిశీలించిన ప్రత్యేక కమిషనర్ సుందరి నందా మాట్లాడుతూ, మెట్రోస్టేషన్ల పరిసరాలలో లైటింగ్ సరిగ్గా ఉండేలా చూడాలని చెప్పారు. మెట్రో స్టేషన్లకు వెళ్లే వీధుల్లో నేరాలు జరగకుండా ఉండాలంటే లైటింగ్ తప్పనిసరని చెప్పారు. రాత్రి పూట చీకటిగా ఉండే వీధుల్లో తమ పెట్రోలింగ్ వ్యాన్లు గస్తీ తిరుగుతుంటాయని పేర్కొన్నారు. అవి తిరిగినా కూడా వీధి దీపాలు మాత్రం తప్పకుండా ఏర్పాట్లు చేయాలని ఆమె చెప్పారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)