amp pages | Sakshi

ప్రశాంతంగానే ఉన్నా కొనసాగుతున్న ఉద్రిక్తత

Published on Wed, 10/29/2014 - 23:02

 సాక్షి, న్యూఢిల్లీ: మతఘర్షణలతో అట్టుడికిపోయిన త్రిలోక్‌పురిలో 144 సెక్షన్ కింద విధించిన నిషేధాజ్ఞలను బుధవారం ఆరు గంటలపాటు సడలించారు. పరిస్థితి ప్రస్తుతం ప్రశాంతంగా ఉందని బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిషేధాజ్ఞలను సడలించామని పోలీసు జాయింట్ కమిషనర్ సంజయ్ బేనీవాల్ చెప్పారు. ప్రజలు అవసరమైన సామగ్రి కొనుక్కోవడానికి వీలుగా సోమవారం గంట సేపు, మంగళవారం మూడు గంటల పాటు నిషేధాజ్ఞలను సడలించారు. ఛత్ పూజను దృష్టిలో పెట్టుకుని సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు నిషేధాజ్ఞలను సడలించామని చెప్పారు. ఈ పూజ చేసేవారు సాయంత్రం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోవడానికి వీలుగా సడలింపు ఇచ్చినట్లు పోలీసులు చెప్పారు.
 
  అక్టోబర్ 23న  హిందూ ముస్లింలకు మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించి పోలీసులు 68 మందిని అరెస్టు చేశారు. తమ వద్ద నున్న ఫొటోలు, వీడియోల ఆధారంగా పోలీసులు ఈ అరెస్టులు చేసినట్లు బేనీవాల్ చెప్పారు. ఐదుగురు ప్రధాన నిందితులలో ఇర్ఫాన్‌ను మంగళవారం సాయంత్రం అరె స్టు చేశారు. మిగతా నలుగురు మొబిన్, ఆసిఫ్, తారిఖ్, జాఫర్  కోసం గాలింపు కొనసాగుతోంది. 36 బ్లాకులున్న త్రిలోక్‌పురిలో ఢిల్లీ పోలీసు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, కేంద్ర భద్రతా బలగాలకు చెందిన వెయ్యి మంది పోలీసులు, 30కి పైగా పోలీసు వ్యాన్లు, వాటర్ కేనన్లు, అల్లర్ల నియంత్రణ వాహనాలతో పహరా కాస్తున్నారు. నిఘా కోసం పోలీసులు డ్రోన్‌ని కూడా ఉపయోగిస్తున్నారు.   
 
  త్రిలోక్‌పురిలో నిషేధాజ్ఞలు మరికొన్ని రోజులు కొనసాగించాలని పోలీసులు యోచిస్తున్నారు. పరిస్థితి పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నందున్న ఏ క్షణాన్నైనా హింస చెలరేగవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నవరాత్రులను పురస్కరించుకుని బ్లాక్ నంబర్-2లో మాతాకీ చౌకీ ఏర్పాటు చేసిన చోట శుక్రవారం జాగరణ్ నిర్వహించవలసి ఉంద ని, అలాగే నవంబర్ 4న మొహర్రంను పురస్కరించుకుని తాజియాల ఊరేగింపు తీస్తారని, మత సంబంధమైన ఈ రెండు కార్యక్రమాల దృష్ట్యా మరికొన్నాళ్ల పాటు భద్రతను మరింత కట్టుదిట్టంగా ఉంచవలసిన ఆవశ్యకత ఉందని పోలీసులు అంటున్నారు .
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)