amp pages | Sakshi

ఢిల్లీ రవాణాశాఖ మంత్రి రాజీనామా

Published on Tue, 06/14/2016 - 13:18

న్యూఢిల్లీ: ఢిల్లీ రవాణాశాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన తన పదవికి  రాజీనామా చేస్తున్నట్లు మంగళవారమిక్కడ ప్రకటించారు. అయితే అనారోగ్యం కారణంగానే రవాణా శాఖ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు గోపాల్ రాయ్ తెలిపారు. దీంతో ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ ...రవాణా శాఖ బాధత్యలను స్వీకరించనున్నారు. కాగా బస్సుల కుంభకోణంలో గోపాల్ రాయ్పై ఆరోపణల నేపథ్యంలో ఆయన రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా తనపై వచ్చిన ఆరోపణలు రుజువైతే జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని గోపాల్ రాయ్ అన్నారు. ఆరోపణల నేపథ్యంలో ఆయన నిన్న ఏసీబీ కార్యాలయానికి వెళ్లి వివరణ కూడా ఇచ్చారు. గతంలో ఆటో పర్మిట్ల కేటాయింపులో భారీగా అక్రమాలు చోటుచేసుకోవడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం 932 ఆటో పర్మిట్లను రద్దు చేసింది.  దీంతో అక్రమాలు జరిగాయంటూ  గోపాల్ రాయ్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

ఇటీవలే గోపాల్ రాయ్ మెడలో ఉన్న బుల్లెట్ను వైద్యులు తొలగించారు. 17 ఏళ్ల  క్రితం లక్నో యూనివర్సిటీలో విద్యార్ధుల ఆందోళన సమయంలో పోలీసుల కాల్పుల్లోఆయన మెడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో ఆయన ఏడాది పాటు  పక్షవాతానికి కూడా గురయ్యారు. ఈ నేపథ్యంలో విశ్రాంతి కోసమే రవాణా శాఖ బాధ్యతల నుంచి గోపాల్ రాయ్ తప్పుకున్నట్లు తెలిపారు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)