amp pages | Sakshi

శ్రీలంకతో ‘ఢీ’ఎంకే

Published on Thu, 09/04/2014 - 00:47

చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళ ఈళ ఆదరవాళర్ అమైప్పు (టెసో) పేరుతో డీఎంకే ఎన్నో ఏళ్లుగా నిరసనోద్యమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గత నెల 26వ తేదీన డీఎంకే కేంద్ర కార్యాలయమైన అన్నా అరివాలయంలో సమావేశమై సెప్టెంబరు 3వ తేదీన చెన్నైలో నిరసన చేపట్టాలని నిర్ణయించి పలు తీర్మానాలను చేసింది. తమిళ ఈలం సోదరులు ఆశించే ఆత్మగౌరవంతో కూడిన స్వేచ్ఛా జీవితం కల్పించాలని, శ్రీలంక ఆగడాలు, మానవహక్కుల ఉల్లంఘనపై ఐక్యరాజ్య సమితి నియమించిన విచారణ బృందం దేశంలో అడుగిడకుండా అడ్డుకున్న శ్రీలంక అధ్యక్షులు రాజపక్సేపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలని, ఐక్యరాజ్యసమితి విచారణ భారత్‌లో జరిపేలా చర్యలు తీసుకోవాలని తదితర తీర్మానాలను చేశారు.
 
 అలాగే శ్రీలంక స్వాధీ నంలో ఉన్న తమిళ జాలర్ల మరపడవలను విడిపించాలని, చేపల వేటపై స్వేచ్ఛను ప్రసాదించాలని తీర్మానం చేశారు. ఈ తీర్మానాల నేపధ్యంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు టెసో ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తిరువళ్లూరు, కాంచీపురం, చెన్నై జిల్లాల నుంచి బుధవారం తెల్లవారుజాము నుంచే టెసో కార్యకర్తలు చేపాక్‌కు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి హాజరయ్యూరు. డీఎంకే దక్షిణ చెన్నై కార్యదర్శి జే అన్బళగన్ స్వాగతోపన్యాసం, కోశాధికారి స్టాలిన్ ప్రారంభోన్యాసం చేశారు.
 
 సమష్టిగా పోరాడితేనే సాధ్యం : కరుణానిధి
 సంఘటిత పోరాటం ద్వారా మాత్రమే తమిళ ఈలం సోదరులకు విముక్తి సాధ్యమని టెసో అధినేత, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి పిలుపునిచ్చారు. టెసో ఆందోళన కార్యక్రమాల్లో చివరగా కరుణ ప్రసంగిస్తూ, దేశాన్ని గతంలో ఎందరో ప్రధానులు పాలించారు, గతంలో వారి కంటే బలమైన ప్రధానిగా ఖ్యాతిని దక్కించుకున్న మోడీ ఈలం తమిళుల సమస్యను పరిష్కరించి ఆ పేరును నిలబెట్టుకోవాలని అన్నారు. డీఎంకే, టెసో నేతలు చేసిన  తీర్మానాల్లోని తీవ్రతను ప్రధాని అర్థం చేసుకోవాలని కోరారు. ఈలం సోదరులు శ్రీలంకలో బానిసజీవితాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళులు తమిళులుగా బతకాలని మాత్రమే కోరుకుంటున్నారని, అయితే రాజపక్సే ఇందుకు నిరాకరిస్తున్నారని చెప్పారు. నిరసన వేదిక కు పక్కనే శ్రీలంక దాష్టీకాలను అనుకరిస్తూ కార్యకర్తలు చేసిన ప్రదర్శనలు హృదయాలను ద్రవింపజేశాయి.
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)