amp pages | Sakshi

రూ.50 కోట్లకు కుచ్చుటోపీ

Published on Fri, 12/05/2014 - 02:06

దేశ విదేశాల్లో 32 వేల మందిని గొలుసుకట్టు పేరుతో మోసం చేసిన న్యూజిలాండ్ మహిళ
కర్ణాటకలో 300 మంది, హైదరాబాద్‌లో 100 బాధితులు
 మహిళతో సహా నలుగురి అరెస్ట్
 

బెంగళూరు :  గొలుసుకట్టు వ్యాపారం పేరుతో రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్న విదేశీయురాలితో సహా నలుగురు వ్యక్తులను నగర సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విదేశీయురాలి చేతిలో దేశ విదేశాల్లో కలిపి దాదాపు 32 వేల మంది మోసపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు మీడియాకు గురువారం వెల్లడించిన వివరాల మేరకు.. మూలతహా న్యూజిల్యాండ్‌కు చెందిన డేనిసే అనే మహిళ  చట్టవ్యతిరేకంగా గొలుసుకట్టు వ్యాపారం నిర్వహిస్తోంది. ఈ సంస్థలో ప్రాథమిక సభ్యుడిగా చేరేవారు రూ.8 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక సంస్థలో ఏజెంట్‌గా విధులు నిర్వర్తించేవారు రూ.25 వేలు చెల్లించాలి. ప్రాథమిక సభ్యత్వం పొందినవారు కాని ఏజెంట్‌గా చేరిన వారు కాని తర్వాత మరో ఇద్దరిని చేర్చాలి. ఇందుకు గాను ప్రాథమిక సభ్యత్వం పొందిన వ్యక్తికి ఒక్కొక్క సభ్యున్ని చేర్పించినందుకు గాను 25 నుంచి 50 శాతం సంస్థ కమీషన్‌గా చెల్లిస్తుంది. అదే విధంగా నూతనంగా చేరిన వారు మరో ఇద్దరిని చేర్చాల్సి ఉంటుంది. ఇందుకు గాను వారికి కూడా కమిషన్ అందుతుంది. ఈ మేరకు పాకిస్తాన్, దుబైతోపాటు చాలా దేశాల్లో ఏజెంట్లను చేర్పించుకుని గొలుసుకట్టు వ్యాపారం చేసింది. ఈ క్రమంలోనే గత అక్టోబర్‌లో బెంగళూరు నగరాన్ని చేరుకుని ఓ రాజ్‌భవన్‌కు దగ్గరగా ఉన్న  పంచనక్షత్రాల హోటల్‌లో బసచేసింది.

తర్వాత వివిధ ఇన్సురెన్స్ కంపెనీల్లో ఏజెంట్లుగా పనిచేస్తున్న మహ్మద్ కురుం, కిరణ్ మోది, హితేష్ మోదిని  లోబరుచుకుని వారి ద్వారా రాష్ట్రంతోపాటు పొరుగున ఉన్న ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్రలో కూడా లావాదేవీలు ప్రారంభించారు. అక్టోబర్ నుంచి విదేశీయురాలు రాజ్‌భవన్‌కు దగ్గరలోని హోటల్‌లో ఉండటం, ఆమె నడవడిక అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు కూపీలాగారు. ఖచ్చితమైన సమాచారంతో ఆమె బసచేస్తున్న హోటల్‌పై దాడిచేశారు. ప్రధాన నిందితురాలు డేనిస్‌తోపాటు మిగిలిన ముగ్గురు నిందితులను కూడా అరెస్టు చేశారు. వారి నుంచి ఒక ల్యాప్‌ట్యాప్, కొన్ని హార్డ్‌డిస్క్‌లు, ఫోన్‌లు స్వాధీనం చేసుకుని నిపుణుల ద్వారా దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటి వరకూ ఈమె చేతిలో దాదాపు 32,339 మంది రూ.50 కోట్ల వరకూ మోసపోయినట్లు వెలుగుచూసింది. నిందితులను కబ్బన్‌పార్క్ పోలీస్‌స్టేషన్‌లో సీసీబీ పోలీసులు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.
 
 డేనిసే చేతిలో వివిధ దేశాల్లో  మోసపోయిన వారు...

 అమెరిక - 2 వేల మంది, ఇండియా - 1,700, మలేషియా - 28 వేలు, న్యూజిలాండ్ - 500, దుబాయ్ - 200, పాకిస్తాన్ - 100
 దేశంలోని వివిధ రాష్ట్రాల్లో...
 కర్ణాటక-300, మహారాష్ట్ర-800, ఢిల్లీ-100, పంజాబ్ -100, మధ్యప్రదేశ్ -300, హైదరాబాద్ -100 మంది
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)