amp pages | Sakshi

డీఎండీకే ఎమ్మెల్యే ఇంటిపై దాడి

Published on Fri, 02/28/2014 - 01:20

 తిరువళ్లూరు, న్యూస్‌లైన్: డీఎండికే గుర్తుపై పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపు సాధించిన తిరుత్తణి ఎమ్మెల్యే, డీఎండీకే పార్టీ తిరువళ్లూరు జిల్లా కార్యదర్శి అన్నాడీఎంకేలో చేరడంపై ఆగ్రహం చెందిన కార్యకర్తలు మనవాలనగర్‌లోని ఆయన ఇంటిపై, కార్యాలయంపై రాళ్లు చెప్పులతో దాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అదుపు చేయలేక నానాఇబ్బంది పడ్డారు. తిరుత్తణి ఎమ్మెల్యే అరుణ్‌సుబ్రమణ్యం గురువారం ఉదయం చెన్నైలో ముఖమంత్రి జయలలిత సమక్షంలో పార్ట్టీలో చేరారు. విషయం తెలుసుకున్న డీఎండీకే కార్యకర్తలు దాదాపు వంద మంది మనవాలనగర్‌కు చేరుకున్నారు. మొదట అరుణ్‌సుబ్రమణ్యంకు చెందిన కళాశాల, వ్యక్తిగత కార్యాలయంపై ఉన్న డీఎండీకే బ్యానర్లను చించేశారు.  
 
 బాణసంచా కాల్చి సంబరాలు: డీఎండీకే పార్టీకి రాజీనామా చేసిన అరుణ్‌సుబ్రమణ్యంతో పార్టీకి పట్టిన శని వదలిందని పేర్కొంటూ భారీగా బాణసంచా కాల్చి స్వీట్లు పంచి పెట్టి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ర్యాలీగా రెండవ విడత అరుణ్ సుబ్రమణ్యం ఇంటి వద్దకు బయలుదేరగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, డీఎండీకే కార్యకర్తలకు తీవ్రస్థాయిలో వాగ్వాదం నెలకొంది. అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటి పోవడంతో ఆగ్రహించిన కార్యకర్తలు అయన ఇంటిపైకి రాళ్లు, చెప్పులు విసిరి ఆందోళన చేపట్టారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకముందే పోలీసులు ఆందోళనకారులను లాక్కెళ్లి దూరంగా పడేశారు. అనంతరం దిష్టిబొమ్మలను తయారు చేసి దహనం చేయడంతో పాటు చెప్పులతో కొట్టి ఊరేగించారు.
 
 మొదటి ఎమ్మెల్యే అవుట్: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డీఎండీకే, అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని 40 స్థానాలకు పోటీ చేసింది. వీటిలో 24 మంది ఎమ్మెల్యేలుగా విజయం సాధించగా, తిరువళ్లూరు  జిల్లా తిరుత్తణి నుంచి అరుణ్‌సుబ్రమణ్యం, గుమ్మిడిపూండి ఎమ్మెల్యే శేఖర్ దాదాపు 30 వేల ఓట్లతో విజయం సాధించారు. డీఎండీకే ఎమ్మెల్యేలు ప్రమాణం చేసిన సమయంలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం తిరుత్తణి ఎమ్మెల్యే అరుణ్‌సుబ్రమణ్యం ప్రమాణం చేసి పార్టీ మొదటి ఎమ్మెల్యేగా ఘనతనూ సాధించారు. అయితే ప్రమాణం చేసిన మొదటి ఎమ్మె ల్యే పార్టీని వీడడం కార్యకర్తల్లో అసంతృప్తి నింపింది.
 ఫలించిన ఒత్తిడి: డీఎండీకేకు గుడ్‌బై చెప్పి అన్నాడీఎంకేలో చేరిన అరుణ్‌సుబ్రమణ్యంపై ఆయన వియ్యంకుడు, అన్నాడీఎంకే పార్టీ కీలక నేత ఢిల్లీ మాజీ ప్రతినిధి నరసింహన్ ఒత్తిడి ఫలించిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.
 
 గతంలో కేబినెట్ హోదాలో వున్న నరసింహన్ పదవిని ఇటీవల ముఖ్యమంత్రి తొలగించారు. ఇందుకు ప్రదాన కారణం అరుణ్‌సుబ్రమణ్యం పార్ట్టీలో చేరుతాననీ గతంలో ఇచ్చిన హామీ మేరకు నడుచుకోకపోవడమేనని అన్నాడీఎంకే వర్గాలు వెల్లడించాయి. అరుణ్‌సుబ్రమణ్యం అన్నాడీఎంకేలో చేరకపోవడం, ఢిల్లీ ప్రతినిధి నరసింహన్ పదవి పోవడం లాంటి సంఘటనతో నరసింహన్ అరుణ్‌సుబ్రమణ్యంపై ఒత్తిడి పెంచి అన్నాడీఎంకేలో చేరేలా చేశారని డీఎండీకే వర్గాలు వ్యాఖ్యానించాయి. బీజేపీతో పొత్తు  కోసం చర్చలు జరుపుతున్న సమయంలో పార్టీ ఎమ్మెల్యే పిరాయించడంతో ఇటు పార్టీ కార్యకర్తలలోనూ, అటుహైకమాండ్‌కు తలనొప్పిగా మారినట్టు పలువురు వ్యాఖ్యానించారు. డీఎండీకే కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో తిరుత్తణికి చెందిన సీనియర్ నేత కృష్ణమూర్తికి పదవి దక్కే అవకాశం వుండగా, పదవి కోసం పలువురు పోటీ పడుతుండడంతో పోటాపోటీ నెలకొంది.
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)