amp pages | Sakshi

ప్రియుడి వివాహం అడ్డుకున్న ప్రియురాలు

Published on Wed, 06/07/2017 - 09:43

కేకే.నగర్‌: ప్రేమ పేరుతో మోసగించి మరో పెళ్లికి సిద్ధమైన ప్రియుడి వివాహాన్ని ప్రియురాలు అడ్డుకుంది. వివాహ మండపంలోనే ప్రియుడిని నిలదీసింది. ఈ సంఘటన విల్లుపురం జిల్లా విక్రవాండిలో చోటుచేసుకుంది. ప్రియుడికి వేరే యువతితో వివాహం ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రియురాలు అతని ఇంటి ముందు బంధువులతో ధర్నాకు దిగడం ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది.

విల్లుపురం జిల్లా విక్రవాండి సమీపంలోని సెండియం పాక్కంకు చెందిన గోపాలకృష్ణన్‌(25) చెంగల్పట్టు చెక్‌పోస్టులో ఉద్యోగి. గోపాలకృష్ణన్‌కు, సెంజికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి విక్రవాండిలో కల్యాణమండపంలో సోమవారం జరగనుంది. గోపాలకృష్ణన్‌ తాళికట్టే సమయంలో చెన్నై సెమ్మంజేరికి చెందిన అర్చన(21) మండపానికి చేరుకుని వివాహం అడ్డుకుంది. తాను చెన్నైలోని ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నానని, తానూ, గోపాలకృష్ణన్‌ ఆరేళ్లుగా ప్రేమించుకున్నట్లు తెలిపింది. పెళ్లి చేసుకుంటానని గోపాలకృష్ణన్‌ నమ్మించాడని దీంతో శారీరకంగా దగ్గరయ్యామని, ప్రస్తుతం తాను ఆరు నెలల గర్భవతి అని చెప్పి బోరున విలపించింది. దీన్ని చూసి పెళ్లికూతురు పెళ్లిపీటల మీద నుంచి లేచి తల్లిదండ్రులతో వెళ్లిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇద్దరి వద్ద విచారణ జరిపారు. చివరకు అర్చనను పెళ్లి చేసుకోవడానికి గోపాలకృష్ణన్‌ ఒప్పుకోవడంతో అర్చన శాంతించింది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)