amp pages | Sakshi

ఆరోగ్యంగా కరుణ

Published on Sat, 12/03/2016 - 01:32

రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్  
పరామర్శల వెల్లువ

 
డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన కుమార్తె, ఆ పార్టీ ఎంపీ కనిమొళి ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇక, కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై పరామర్శలు వెల్లువెత్తుతున్నారుు.
 
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత ఎం. కరుణానిధి గురువారం ఉదయం న్యూట్రీషన్, డీహైడ్రేషన్ సమస్యతో ఆళ్వార్‌పేటలోని కావేరి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు రెండోరోజు శుక్రవారం అక్కడి వైద్యులు చికిత్స అందించారు. కరుణానిధి వెంట ఆసుపత్రిలో ఆయన కుమారులు స్టాలిన్, అళగిరి, కుమార్తెలు సెల్వి,కనిమొళి ఉన్నారు. వృద్ధులకు చికిత్స అందించే ప్రత్యేక ఐసీయూ యూనిట్ విభాగంలో కరుణానిధి ఉన్నట్టు  సమాచారం. ఆయన ఆసుపత్రిలో చేరిన సమాచారంతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఫోన్లో పరామర్శించారు. ఎంపీ, కరుణ గారాల పట్టి కనిమొళితో ఆయన మాట్లాడారు. ఎండీఎంకే నేత వైగో, ఇక, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, సీపీఎం ఎంపీ టీకే రంగరాజన్, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఫోన్ ద్వారా పరామర్శించారు.

 ఇక, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్, మాజీ అధ్యక్షుడు కేవీ తంగబాలు, అధికార ప్రతినిధి కుష్బు, తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్, కేంద్ర మాజీ మంత్రులు టీఆర్ బాలు, పళని మాణిక్యం ఆసుపత్రి వద్దకు చేరుకుని కరుణానిధిని పరామర్శించారు. కరుణానిధిని పరామర్శించినానంతరం మీడియాతో డీఎంకే సంయుక్త ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ మాట్లాడుతూ, కరుణానిధి ఆరోగ్యంగానే ఉన్నారని, ఆహారం తీసుకుంటున్నారని వివరించారు. వైద్యుల సూచన మేరకే ఆయన డిశ్చార్జ్ అవుతారనీ, ఆయన నిర్ణయం మేరకు డిశ్చార్జ్ ఇక్కడ ఉండదంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కాస్త సీఎం జయలలిత డిశ్చార్జ్ విషయంగా అపోలో వర్గాల వ్యాఖ్యల్ని ఎద్దేవా చేస్తున్నట్టు ఉండడం గమనార్హం. ఇక, కనిమొళి మీడియాతో మాట్లాడుతూ అధినేతకు ఎలాంటి సమస్య లేదు అని, ఆయనకు సాధారణ చెకప్ మాత్రమేనని, రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని ప్రకటించారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)