amp pages | Sakshi

హాట్ హాట్‌గా..‘లిప్‌లాక్’

Published on Sun, 11/09/2014 - 22:10

న్యూఢిల్లీ: నగరంలో ‘లిప్‌లాక్’ హాట్ టాపిక్‌గా మారిపోయింది. బహిరంగంగా జంటలు ముద్దు పెట్టుకోకూడదని, ఇది హిందూ సంస్కృతికి వ్యతిరేకమని కొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడంపై (మోరల్ పోలిసింగ్‌పై) నిరసన వ్యక్తమవుతోంది.  ‘కిస్ ఆఫ్ లవ్’ పేరుతో కేరళలోని కోచిలో ఈ నెల 2వ తేదిన ఉద్యమం మొదలైంది. బహిరంగంగా ఒకరికొకరు ముద్దు పెట్టుకోవడాన్ని అనైతిక చర్యగా బావిస్తూ కొన్ని శక్తులు వ్యతిరేకిస్తున్నాయి. దీన్ని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల ‘ముందుల ఉద్యమం’ పేరుతో యువత జంటలుగా  ‘లిప్‌లాక్’ చేస్తూ బహిరంగాగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ముంబై, కోల్‌కత్తాతోపాటు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో హల్‌చల్ చేసిన ‘లిప్‌లాక్’ సందడి  దేశరాజధానికి విస్తరించింది. శనివారం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జంటలు రోడ్లమీదికి వచ్చి నిరసన వ్యక్తం చేశాయి. ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగడంతో విద్యార్థుల అరెస్టులు, విడుదల జరిగిపోయాయి.
 
 దీనికి కొనసాగింపుగా ఆదివారం జవహర్‌లాల్ నె హ్రూ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి యువజంటలు గంగాదాబా ఎదుట ముద్దులు పెటుకొని నిరసన కొనసాగించారు. ‘ప్రేమను  వ్యక్తం చేసే స్వేచ్ఛ’ కావాలని నినదించారు. మన వేదాల్లో కూడా ఈ స్వేచ్ఛ ఉన్నదని, ప్రముఖ ఖజురాహో దేవాలయంపై కూడా ముద్దుల సన్నివేశాలతో కూడిన శిల్పాలు ఉన్నాయని విషయాన్ని విద్యార్థి యువజంటలు గర్తుచేశారు. కాగా, వామపక్ష విద్యార్థి సంఘాలు లిప్‌లాక్ ఉద్యమాన్ని బలపర్చుతుండగా, మితవాద విద్యార్థి సంఘాలు, ఆర్‌ఎస్ లాంటి శక్తులు అడ్డుకోవడంతో చర్చనీయాంశంగా మారింది.
 

Videos

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)