amp pages | Sakshi

కుష్బుకు పదవి ఖాయం

Published on Tue, 02/24/2015 - 01:30

కాంగ్రెస్‌లో అడుగు పెట్టిన  కుష్బు త్వరలో మంత్రి కాబోతున్నారట. ఇదేదో సినిమా షూటింగ్ మాత్రం కాదు. ఆమెను మంత్రిగా చూడాలన్న ఆశలో రాష్ర్ట కాంగ్రెస్ వర్గాలు ఉన్నాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా అధికార పగ్గాలు చేపట్టగానే ఆమెకు కేబినెట్‌లో పదవి గ్యారంటీ అని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ స్పష్టం చేశారు.
 
 సాక్షి, చెన్నై : డీఎంకే కుటుంబ రాజకీయాల్ని తట్టుకోలేక, గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి కుష్బు ఇటీవల అడుగు పెట్టారు. ఆమె ఆ పార్టీలో సెలబ్రెటీ అయ్యారు. తమ ప్రాంతానికి కంటే తమ ప్రాంతానికి రావాలంటూ ఆమెను ఆహ్వానించి మరీ సభలను కాంగ్రెస్ వర్గాలు ఏర్పాటు చేస్తున్నాయి. పార్టీ పరంగా ఆమెను అందలం ఎక్కించేందుకు ఏఐసీసీ ఓ వైపు కసరత్తుల్లో ఉంటే, మరో వైపు ఆమెను మంత్రిగా చూడాలన్న ఆశల పల్లకిలో టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్ ఊగిసలాడుతున్నట్టున్నారు. రానున్న ఎన్నికల్లో అధికారం చేపడితే, కుష్బు మంత్రి కావడం తథ్యమని స్పష్టం చేస్తున్నారు.  అరుంబాక్కంలో కాంగ్రెస్ నేతృత్వంలో సభ జరిగింది. ఇందులో సాగిన ఆసక్తికర ప్రసంగాలు విన్న వారిని విస్మయంలో పడేశాయి.
 
  కుష్బు తన ప్రసంగంలో అన్నాడీఎంకే సర్కారు తీరును ఎండగట్టారు. డీఎంకే హయాంలో విద్యుత్ కోతలు పెరిగాయంటూ అన్నాడీఎంకేకు అధికార పగ్గాలు ఇచ్చారని గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు రాష్ట్రంలో వీధి దీపాలు కూడా వెలగడం లేదని ధ్వజమెత్తారు. బీజేపీ విషయానికి వస్తే మిస్డ్ కాల్ రూపంలో రోజుకు లక్షల మందిని చేర్పించేస్తున్నామని డప్పులు వాయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రోజుకు లక్షల మంది సభ్యత్వం తీసుకుంటున్నప్పుడు శ్రీరంగంలో ఐదు వేల ఓట్లే వచ్చాయి ఎందుకో? అని ప్రశ్నించారు. ప్రజల సీఎం...ప్రజల సీఎం అని డప్పులు వాయించుకున్న వాళ్లకు కనీసం సిగ్గు కూడా లేదని విమర్శించారు. ప్రజా సీఎం కామరాజర్ మాత్రమేనన్నది ప్రతి ఒక్కరూ గుర్తు ఎరగాలని హితవు పలికారు. జైలు శిక్ష పడ్డ వాళ్లను ప్రజా సీఎం .. అని సంబోధిస్తుండడం సిగ్గు చేటుగా వ్యాఖ్యానించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమన్నారు.
 
 తాము అధికారంలోకి రావడంలో ఎలాంటి మార్పు లేదని, తప్పకుండా వస్తామని స్పష్టం చేశారు. కుష్భు ప్రసంగం అనంతరం మైకు అందుకున్న టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఆమెను పొగడ్తల పన్నీరులో ముంచారు. ఆమె రాకతో పార్టీలో కొత్త ఉత్సాహం ఆవహించిందన్నట్టుగా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అన్నం తినడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని, అందుకే శ్రీరంగం ఉప ఎన్నికలకు దూరంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. కేంద్రంలో, రాష్ట్రంలోని పాలకుల శకం ఇక ముగిసినట్టేన్నారు. ప్రజల్లో ఆ రెండు ప్రభుత్వాలపై వ్యతిరేకత బయలుదేరిందని పేర్కొన్నారు. కుష్బు చెబుతున్నట్టుగా 2016లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమన్నారు.
 
  అధికారంలోకి రాగానే, మంత్రి వర్గంలో ఆమెకు చోటు ఖాయం అని స్పష్టం చేశారు. ఆమె మంత్రి కావడంలో ఎలాంటి మార్పు లేదని, ఆమె మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి తీరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రసంగాల్ని ఆసక్తికరంగా నోళ్లు ఎల్లబెట్టిన కాంగ్రెస్ వర్గాలు చివరకు ఈవీకేఎస్ సినీ భక్తికి అవధులు లే కుండాపోయాయని పెదవి విప్పారు. మరి కొందరు ఏకంగా కాంగ్రెస్ పార్టీ  సీఎం అభ్యర్థిగా కుష్భును ప్రకటించేస్తారేమోనన్నట్టుగా వ్యాఖ్యానించడం గమనార్హం.
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)