amp pages | Sakshi

ఇక ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల ఆటకట్టు

Published on Wed, 04/23/2014 - 22:22

సాక్షి, ముంబై: ప్రయాణికులపట్ల దురుసుగా వ్యవహరించే ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల ఆట కట్టించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం రవాణా విభాగం ఓ సాఫ్ట్‌వేర్‌ను త్వరలో అందుబాటులోకి తేనుంది. దీంతో ఇటువంటి డ్రైవర్లపై చర్యలు తీసుకునే వీలుంది. బాధిత ప్రయాణికులు ‘ఐవీఆర్‌ఎస్ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్’ నంబర్ (1800-22-0110)ను ఆశ్రయించాల్సి ఉంటుంది. అమర్యాదగా ప్రవర్తించిన డ్రైవర్ల ట్యాక్సీ, ఆటోల నంబర్లను అందులో పొందుపర్చాల్సి ఉంటుంది.

 ఇందువల్ల పర్మిట్ హోల్డర్ డిజిటల్ డాటా  ఫిర్యాదుతో సహా ఆర్టీవో అధికారులకు కనిపిస్తుంది. తద్వారా ఆర్టీవో అధికారులు ఇటువంటి డ్రైవర్లపై సత్వరమే చర్యలు తీసుకుంటారు. ప్రయాణికులను ఎక్కించుకునేందుకు నిరాకరించినా లేదా దురుసుగా వ్యవహరించినా లేదా ఎక్కువ చార్జీలు వసూలు చేసినా ప్రయాణికులు ఫిర్యాదు చేయొచ్చు. ఈ ఫిర్యాదు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటారు. కాగా ఫిర్యాదుదారులకు ఆర్టీవో కార్యాలయ అధికారులు రసీదు ఇస్తే బాగుంటుందని కొంతమంది ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ఇది సంక్షిప్త సమాచార సేవ (ఎస్‌ఎంఎస్) ఆధారంగా ఉండాలని ప్రయాణికుల హక్కుల కార్యకర్త సునీల్ సూచించారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)