amp pages | Sakshi

కోడ్ ఉల్లంఘించిన ఇండిపెండెంట్ అభ్యర్థికి నోటీసు

Published on Wed, 09/24/2014 - 22:16

గుర్గావ్: హర్యానాలో అక్టోబర్ 15వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరించిన అభ్యర్థులపై చర్యలకు ఈసీ నడుంబిగించింది. బాద్‌షాపూర్ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి ముఖేష్ శర్మ ఎలక్షన్ అధికారి నుంచి  అనుమతి తీసుకోకుండానే బహిరంగ సమావేశం నిర్వహించినందుకు అడిషనల్ డిప్యూటీ కమిషనర్ పీఎస్ చౌహాన్, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్‌ఓ) మంగళవారం నోటీసు జారీ చేశారు. నోటీసు అందిన 48 గంటల్లో సమాధానం చెప్పాలని, సకాలంలో స్పందించకుంటే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు తక్షణమే చర్యలు తీసుకొంటామని నోటీసులో హెచ్చరించారు.
 
 ఎన్నికల అధికారి నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే ముఖేష్ శర్మ భారీ ఎత్తున కార్యకర్తలను తరలించి బహిరంగ సమావేశం నిర్వహించినట్లు ఓ హిందీ పత్రికలో మీడియా కథనం ప్రచురితమైందని, అందుకే అతడికి నోటీసు జారీ చేసినట్లు ఆర్‌ఓ చెప్పారు. ఇంకా పలుచోట్ల  ఎన్నికల అధికారుల అనుమతులు తీసుకోకుండానే బహిరంగ సమావేశాలు నిర్వహించనట్లు పేర్కొన్నారు. ఎన్నికల మోడల్ కోడ్ సెప్టెంబర్ 12వ తేదీ నుంచి అమలులోకి వచ్చిందని చెప్పారు.
 
 90 మంది సభ్యులున్న అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 15వ తేదీన నిర్వహించామని, అక్టోబర్ 19వ తేదీన కౌంటింగ్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి బహిరంగ సమావేశాలు నిర్వహించడానికి అభ్యర్థులు కచ్చితంగా సంబందిత ఎన్నికల అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఎన్నికల్లో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినవారికి చర్యలు తీసుకోంటామని చెప్పారు.
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)